31 మ్యాచులు, 25 రోజుల షెడ్యూల్, 8 డబుల్ హెడెడ్ మ్యాచులు... ఐపీఎల్ 2021 సీజన్‌పై...

First Published Jun 3, 2021, 3:49 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. సెప్టెంబర్-అక్టోబర్ మసాల్లో యూఏఈ వేదికగా మిగిలిన మ్యాచులు నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన బీసీసీఐ, ప్రస్తుతం అక్కడి పరిస్థితులను తనిఖీ చేస్తోంది.

యూఏఈ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారులతో బీసీసీఐ చర్చలు దాదాపు ముగిశాయి. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌(పీఎస్‌ఎల్) మ్యాచులు కూడా యూఏఈలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి పీఎస్‌ఎల్ పూర్తి అవుతుంది.
undefined
బీసీసీఐ సెక్రటరీ జే షాతో పాటు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, తదితరులు ప్రస్తుతం యూఏఈలోనే ఉండి, అక్కడి మంత్రులతో ఐపీఎల్ 2021 సీజన్ గురించి చర్చలు జరుపుతున్నారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల నిర్వహణకు బీసీసీఐకి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది ఈసీబీ...
undefined
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచులను 25 రోజుల్లో ముగించాలని భావిస్తున్నారట బీసీసీఐ అధికారులు. ఇందులో 8 డబుల్ హెడెడ్ మ్యాచులు ఉంటాయి.
undefined
భారత్ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా పాజిటివ్ కేసుల సమయంగా బ్రేక్ సమయానికి 29 మ్యాచులు పూర్తి అయ్యాయి. 6 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్‌లో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే విజయంతో ఆఖరి స్థానంలో ఉంది.
undefined
మొదట వ్యాక్సిన్ వేయించుకున్నవారికి స్టేడియాల్లోకి అనుమతి కల్పించి, 50 శాతం ప్రేక్షకులతో మ్యాచులు నిర్వహించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ 30 శాతం కెపాసిటీ ప్రేక్షకుల అనుమతికి ఓకే చెప్పింది.
undefined
భౌతిక దూరం నిబంధన కారణంగా 50 శాతం ప్రేక్షకులను అనుమతించలేదని చెప్పింది. ఇప్పటికే యూఏఈలో పబ్లిక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ 30 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నామని, ఐపీఎల్ 2021 సీజన్‌ విషయంలో కూడా ఇదే చేస్తామని చెప్పారు...
undefined
దేశంలో కరోనా కేసులు తగ్గుతుండడంతో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ విషయంలో కూడా యూఏఈతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెలాఖరున టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే వేదికను నిర్ణయించేందుకు ఐసీసీని గడువు కోరింది బీసీసీఐ.
undefined
ఇక్కడ మ్యాచులు నిర్వహించడం సాధ్యం కాకపోతే యూఏఈ వేదికగా బీసీసీఐ అధ్వర్యంలోనే టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరగబోతున్నట్టు సమాచారం. జూన్ 28 లోగా నిర్ణయం ప్రకటించాల్సిందిగా బీసీసీఐని కోరింది ఐసీసీ.
undefined
click me!