ఆ ఇద్దరి బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం, అతను చాలా స్లోగా బౌలింగ్ చేస్తాడు... ఇషాన్ కిషన్ కామెంట్...

First Published Jun 3, 2021, 4:13 PM IST

ఐపీఎల్ 2020లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, టీమిండియాలోకి బాణంలా దూసుకొచ్చాడు ఇషాన్ కిషన్. మొదటి మ్యాచ్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాది, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన ఇషాన్ కిషన్, తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడిన ఇషాన్ కిషన్, ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్‌ను బయటపెట్టాడు.
undefined
‘ముంబై ఇండియన్స్ నెట్ ప్రాక్టీస్ సమయంలో ఎవరి బౌలింగ్ ఎదుర్కోవడానికి బాగా ఇబ్బంది పడతారు?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇషాన్ కిషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
undefined
‘జస్ప్రిత్ బుమ్రా, ఇంకా కృనాల్ పాండ్యా...’ అంటూ సమాధానం ఇచ్చాడు ఇషాన్ కిషన్. బుమ్రా టాప్ క్లాస్ బౌలర్ కాబట్టి అతన్ని ఎదుర్కోవడానికి ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఇబ్బంది పడడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ కృనాల్ పాండ్యా పేరు చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.
undefined
ఎందుకంటే కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో పెద్దగా స్పిన్ ఉండదు. స్పిన్ బౌలింగ్‌ పేరుతో ఇసిరి కొడతాడని కృనాల్ పాండ్యాను ట్రోల్ చేస్తూ ఉంటారు అభిమానులు. అయితే నెట్స్‌లో మాత్రం అతను చాలా స్లోగా బౌలింగ్ చేస్తాడట.
undefined
‘నెట్స్‌లో కృనాల్ పాండ్యా చాలా స్లోగా బౌలింగ్ చేస్తాడు. అతను అంత నెమ్మదిగా బంతులు విసురుతాడంటే మీరు నమ్మరు కూడా. కొన్ని సార్లు బాల్ నా దాకా వచ్చేలోపు రెండుసార్లు బ్యాటును తిప్పేస్తుంటా...’ అంటూ చెప్పాడు ఇషాన్ కిషన్.
undefined
‘ముంబై ఇండియన్స్ జట్టులో నాకు తెలిసినంత వరకూ సిగ్గుపడేవాళ్లు ఎవ్వరూ లేరు. కానీ అందరిలోకి జస్ప్రిత్ బుమ్రాకి కాస్త మొహమాటం ఎక్కువ. ఎందుకంటే అతన్ని మనం కేవలం మ్యాచులు ఆడుతున్నప్పుడు మాత్రమే చూడగలం.
undefined
మ్యాచులు అయిపోగానే అతను మాయం అయిపోతాడు. టీమ్ పార్టీలకు కూడా బుమ్రా రాడు, ఒకవేళ వచ్చినా ఎక్కువ సేపు ఉండడు. ఐదు, పది నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు’ అని చెప్పాడు ఇషాన్ కిషన్.
undefined
22 ఏళ్ల ఇషాన్ కిషన్, 2021 సీజన్‌లో ఆశించినంతగా రాణించలేకపోయాడు. మొదటి నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విఫలమైన ఇషాన్ కిషన్‌ను తప్పించి, వేరే ఆటగాళ్లకి జట్టులో చోటు కల్పించాడు రోహిత్ శర్మ. యంగ్ ప్లేయర్‌ను ఇలా తప్పించడంపై రోహిత్‌పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఏడు మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచిన ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి అద్భుత విజయం అందుకుంది ముంబై.
undefined
click me!