ధోనీ, కోహ్లీలను కూడా అవుట్ చేస్తాను, కానీ ఈ కుర్రాడికి బౌలింగ్ వేయడం కష్టం... - రషీద్ ఖాన్...

First Published Jun 2, 2022, 11:38 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు రషీద్ ఖాన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి బయటికి వచ్చి రూ.15 కోట్ల భారీ ప్రైజ్ దక్కించుకున్న రషీద్ ఖాన్, 6.6 ఎకానమీతో బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 19 వికెట్లు తీసిన రషీద్ ఖాన్, బ్యాటింగ్‌లో 91 పరుగులు చేసి టీమ్‌కి విజయాన్ని అందించాడు. తన మాజీ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన రషీద్ ఖాన్,  ఈ సీజన్‌లో బెస్ట్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ నమోదు చేశాడు...

Image credit: PTI

‘ఐపీఎల్‌లో నేను ఏ బ్యాటర్‌ని ఎదుర్కోవడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లను కూడా నేను చాలా అవుట్ చేశాడు...

Latest Videos


అయితే ఈ నేను బౌలింగ్ చేయడానికి బాగా ఇబ్బందిపడిన ఓ బ్యాటర్, లక్కీగా నా టీమ్‌లోనే ఉన్నాడు. అతను ఎవరో కాదు శుబ్‌మన్ గిల్... గిల్ లాంటి ప్లేయర్, టీమ్‌లో ఉంటే జట్టులో రెట్టింపు ఎనర్జీ వస్తుంది...

ఈ ప్లేయర్‌లో అతను ఆడిన విధానం చాలా బాగుంది. నన్ను బాగా ఇబ్బంది పెట్టిన గిల్, నా టీమ్‌లోనే ఉండడం నా అదృష్టమే... అతను ఫ్యూచర్‌గా పెద్ద స్టార్ అవుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు రషీద్ ఖాన్...

ఫైనల్‌ మ్యాచ్‌లో మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా వికెట్లను త్వరగా కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. అయితే హార్ధిక్ పాండ్యాతో కలిసి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్‌తో కలిసి 47 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి... గుజరాత్ టైటాన్స్‌కి టైటిల్ అందించాడు...

ఫైనల్ మ్యాచ్‌లో 43 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించాడు. 

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 34.50 సగటుతో 483 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, 132.33 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు బాదిన శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ కెరీర్‌లో బెస్ట్ స్ట్రైయిక్ రేటు, అత్యధిక పరుగులు, బెస్ట్ వ్యక్తిగత స్కోర్లను నమోదు చేశాడు... 

click me!