ధోనీ నా కంటే ఫిట్‌గా ఉన్నాడు! రెండు మూడేళ్ల నుంచి ఈ మాటలు వింటున్నా... రోహిత్ శర్మ కామెంట్...

First Published Mar 29, 2023, 2:05 PM IST

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ తర్వాత టీమిండియాకి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి...

ఐపీఎల్ 2020 సీజన్‌తోనే ధోనీ, ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. సీఎస్‌కేతో మ్యాచులు పూర్తయిన తర్వాత మిగిలిన జట్ల ప్లేయర్లు, ధోనీ జెర్సీపై ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానకి తెగ ఎగబడ్డారు. ఎట్టకేలకు ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత ఇప్పట్లో రిటైర్ కానని స్పష్టం చేశాడు మాహీ...

ఐపీఎల్ 2021 సీజన్‌తో ధోనీ, క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. అయితే కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగో టైటిల్ అందించిన మహేంద్రుడు, ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ ఆడాడు. అయితే 2023 సీజన్‌లో సొంత మైదానంలో సొంత అభిమానుల మధ్య ఆఖరి మ్యాచ్ ఆడతానని కామెంట్ చేశాడు ధోనీ...

Latest Videos


మూడు సీజన్ల తర్వాత ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సొంత అభిమానుల మధ్య మ్యాచులు ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీకి ఇదే ఫేర్‌వెల్ సీజన్ అని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు...

‘నాకు తెలిసి మాహీకి ఇది ఆఖరి సీజన్ కాదు. రెండు మూడేళ్ల నుంచి ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అనే వార్తలు వింటూనే ఉన్నా. అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఇప్పటికీ ఆడాలనే తపన అతనిలో కనిపిస్తోంది...

rohit dhoni

నాకు తెలిసి ధోనీ ఇప్పట్లో రిటైర్ అవ్వడు. ఈజీగా మరో రెండు మూడు సీజన్లు ఆడగలడు.. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ధోనీని మళ్లీ కలవడం కోసం ఎదురుచూస్తున్నా.. ’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ..

ఐపీఎల్ చరిత్రలో ఏ మ్యాచ్‌లకీ రానంత క్రేజ్, హైప్... ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌కి వస్తుంది. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ మధ్య మ్యాచ్‌ చూసేందుకు ఐపీఎల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందుకే ఐపీఎల్‌లో ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్‌ని ‘ El Clasico’ గా పేర్కొంటారు..

rohit dhoni

ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగు సార్లు టైటిల్ విన్నర్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కలిసి.. గత సీజన్‌లో గెలిచింది 8 మ్యాచులే. చెరో 10 మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్... నాలుగేసి మ్యాచుల్లో గెలిచి ఆఖరి స్థానాల్లో నిలిచాయి.. 

click me!