IPL2021: గత మ్యాచ్‌లో జరిమానా... నేటి మ్యాచ్‌ను 90 నిమిషాల్లోనే ఇన్నింగ్స్ ముగించిన ధోనీ...

First Published Apr 16, 2021, 10:50 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ను పరాజయంతో మొదలెట్టింది మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌. అయితే రెండో మ్యాచ్‌లోనే అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది సీఎస్‌కే... గత మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన పంజాబ్‌ కింగ్స్‌ని అందులో సగం కూడా కొట్టనివ్వలేదు...

మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ మొదటి వికెట్‌కి 130+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, పటిష్టమైన స్థితికి చేర్చడంతో188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇట్టే ఊదేసింది ఢీసీ.
undefined
ఇద్దరు యంగ్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో ఫీల్డ్ సెట్టింగ్‌కి, బౌలింగ్ మార్పులకు చాలా సమయం తీసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ..
undefined
దీంతో 2021 ఐపీఎల్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే స్లో ఓవర్ రేటు కారణంగా మహేంద్ర సింగ్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా పడింది. దీంతో రెండో మ్యాచ్‌లోనే అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇన్నింగ్స్‌ను 90 నిమిషాల్లోనే ముగించిన కెప్టెన్‌గా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీపక్ చాహార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తుండడంతో అతన్నే కొనసాగించిన ధోనీ... మొదటి 7 ఓవర్లలో దీపక్ చాహార్‌తో 4 ఓవర్లు వేయించాడు...
undefined
గత మ్యాచ్‌లో 221 పరుగుల భారీ స్కోరు చేసిన పంజాబ్‌ కింగ్స్‌ను 106 పరుగులుకే పరిమితం చేసింది చెన్నై సూపర్ కింగ్స్... దీపక్ చాహార్ కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదుచేశాడు...
undefined
4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడమే కాకుండా ఓ మెయిడిన్ కూడా వేసిన దీపక్ చాహార్ 50 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక మెయిడిన్లు వేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. సందీప్ శర్మ 8, ప్రవీణ్ కుమార్ 7 మెయిడిన్లతో టాప్‌లో ఉండగా, దీపక్ చాహార్ 50 ఇన్నింగ్స్‌ల్లో 6 మెయిండిన్లు వేశాడు.
undefined
click me!