CSKvsPBKS: పంజాబ్ దుమ్ము దులిపిన దీపక్ చాహార్, షారుక్ ఖాన్ ఒంటరిపోరాటంతో...

First Published Apr 16, 2021, 9:02 PM IST

IPL 2021 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, రెండో మ్యాచ్‌లోనే అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సీఎస్‌కే, పంజాబ్ కింగ్స్ జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేయగలిగింది...

గత మ్యాచ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన మయాంక్ అగర్వాల్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్...
undefined
ఆ తర్వాత 7 బంతుల్లో 5 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కొట్టిన ఓ బుల్లెట్ డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు. 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది.
undefined
10 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన క్రిస్‌గేల్, దీపక్ చాహార్ బౌలింగ్‌లోనే రవీంద్ర జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికి నికోలస్ పూరన్ డకౌట్ అయ్యాడు...
undefined
15 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన దీపక్ హూడా కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన దీపక్ చాహార్, పంజాబ్ కింగ్స్‌ను దారుణంగా దెబ్బ తీశాడు...
undefined
26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్‌ను ఆరో వికెట్‌కి 31 పరుగుల భాగస్వామ్యం జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు షారుక్ ఖాన్, జే రిచర్డ్‌సన్...
undefined
అయితే 22 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన జే రిచర్డ్‌సన్‌ను మొయిన్ ఆలీ క్లీన్ బౌల్డ్ చేయడంతో 57 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్...
undefined
ఏడో వికెట్‌కి 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 14 బంతుల్లో 6 పరుగులు చేసిన మురుగన్ అశ్విన్, బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించ అవుట్ అయ్యాడు. 87 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్...
undefined
ఓ వైపు వికెట్లు పడుతున్నా 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన షారుక్ ఖాన్, ఆఖరి ఓవర్‌ మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి, రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకి పరిమితమైంది పంజాబ్ కింగ్స్.
undefined
click me!