ఆయన వల్లే నా టెక్నిక్ మారింది! బంతి మనవైపు వస్తున్నప్పుడు అలా చేయడం ఎందుకు?- ఎంఎస్ ధోనీ...

First Published Sep 23, 2022, 5:04 PM IST

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. మాహీ కెరీర్‌లో మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచింది భారత జట్టు. బెస్ట్ కెప్టెన్ మాత్రమే కాదు, ఎంఎస్ ధోనీ వరల్డ్ క్రికెట్‌లోనే బెస్ట్ వికెట్ కీపర్ కూడా.ప్రపంచంలోనే అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

అంతర్జాతీయ కెరీర్‌లో 829 క్యాచులు అందుకున్న ధోనీ, సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బ్రౌచర్ (998), ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (905) తర్వాతి స్థానంలో నిలిచాడు. అయితే తన కెరీర్‌లో 195 స్టంపౌట్లు చేసిన ధోనీ, ఈ విషయంలో మాత్రం టాప్‌లో ఉన్నాడు...

కెరీర్‌ ఆరంభంలో మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ స్టైల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకుముందు చేసిన వికెట్ కీపర్లను ఫాలో అవ్వకుండా కొత్త టెక్నిక్‌ వాడుతున్నాడని మాహీని తీవ్రంగా విమర్శించారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే అదే టెక్నిక్‌తో రికార్డులు బ్రేక్ చేశాడు ధోనీ..

‘‘నేను టెన్నిస్ బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడేవాడు. టెన్నిస్ బాల్‌ని అందుకోవాలంటే సాఫ్ట్ హ్యాండ్స్ కావాలి. హార్డ్ హ్యాండ్స్ ఉంటే బాల్ జారిపోతుంది. అందుకే అక్కడే నేను ఫోకస్ పెట్టాను. లెదర్ బాల్ క్రికెట్‌కి వచ్చిన తర్వాత నా కెరీర్ ఆరంభంలో చాలా మంది సాయం చేశారు...

ముఖ్యంగా అప్పటి సెలక్టర్ కిరణ్ మోరే, నన్ను బాగా గమనించేవారు. నా కీపింగ్ విషయంలో ఆయన ఎంతో సాయం చేశారు. నాకు డ్రిల్స్ చేయించేవారు. నా వికెట్ కీపింగ్ టెక్నిన్‌ని ఆయన బాగా అర్థం చేసుకున్నారు. అదే నాకు బాగా నచ్చింది. నా టెక్నిక్ భిన్నమైనది, కాపీబుక్ స్టైల్ కాదు...
 

అందుకే ఆయన నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ‘నీ టెక్నిక్ విభిన్నంగా ఉంది. కాపీబుక్‌ని పక్కనబెడదాం. నీ టెక్నిక్‌కి తగ్గట్టుగా డ్రిల్స్ చేద్దాం. నువ్వు మెరుగ్గవడానికి అది చాలా అవసరం... నువ్వు అన్నీ క్యాచులు పడుతున్నావు, ఏదీ మిస్ చేయడం లేదు. అది చాలా ముఖ్యం..’ అన్నారు... 

Dhoni Stumping

ఆయన నా టెక్నిక్ గురించి నాలో నమ్మకం నింపారు. నా స్కిల్స్‌పైన ఏళ్ల పాటు పని చేసేలా చేశారు. గత 50 ఏళ్లల్లో వికెట్ కీపర్లు చేస్తున్న పనినే నేను కూడా చేశాను. కొత్తగా ఏమీ చేయలేదు. క్రికెట్‌ మనకేమీ ఇస్తుందనేది ఎంత ముఖ్యమో క్రికెట్‌కి మనమేమీ ఇస్తున్నామనేది కూడా అంతే ఇష్టం...

Dhoni Stumping

బంతి నీవైపు వస్తున్నప్పుడు అందరూ దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆలెడ్రీ బంతి నీవైపే వస్తున్నప్పుడు దాన్ని అందుకోవడం ఎందుకు. కీపర్లు గ్లవ్స్ వేసుకుని ఉంటారు. అది రబ్బరు. అందులో కాటన్ ఉంటుంది. కాబట్టి సాఫ్ట్‌గానే ఉంటుంది.

Stumping

కాబట్టి బంతిని అందుకోవాల్సిన అవసరం ఏముంది.  మనం చేయాల్సిందల్లా బంతిని వేగంగా లాక్కోవడమే...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... 

click me!