ఆ రోజు మాహీ కళ్లల్లో నీళ్లు చూశాను, ఆ ఫోటో నాకు చాలా స్పెషల్... విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్...

First Published Oct 23, 2022, 10:12 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, ఈసారి సాధారణ బ్యాటర్‌గా బరిలో దిగుతున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 ఆడుతున్న జట్టులో విరాట్ కోహ్లీ కీలక సభ్యుడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీతో చేసిన ఓ ఇంటర్వ్యూని విడుదల చేసింది ఐసీసీ...

Dhoni-Kohli-Ravi Shastri

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2014, 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ... వరుసగా రెండు టోర్నీల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కించుకున్నాడు. ఇప్పటిదాకా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా ఉన్నాడు విరాట్...

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ కోహ్లీ, ఈ టోర్నీల్లో బ్యాటుతో చక్కగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్‌లోనూ గౌతమ్ గంభీర్‌తో కలిసి 83 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ, 49 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

Latest Videos


‘ఎమ్మెస్ ధోనీతో నా అనుబంధం, స్నేహాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే అందులో నమ్మకం ఉంటుంది. మేం ఎప్పుడూ బ్యాటింగ్ గురించి, పరుగులు చేయడం గురించి అస్సలు మాట్లాడుకోం... బంతి గ్యాప్‌లో వెళ్లగానే మాహీ 2 పరుగులు తీస్తాడని నాకు అర్థమైపోతుంది...

అలా కలిసి ఆడిన 10-12 ఏళ్లల్లో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మా మధ్య రనౌట్స్ జరగాయనుకుంట. టీమ్ కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉంటామని ఒకరి గురించి మరొకరికి క్లియర్‌గా తెలుసు. ఈ నమ్మకంతోనే మా బంధం, ఆటను మించిపోయింది...

నా కెరీర్ ఆరంభంలో ధోనీ ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది. అతనెప్పుడూ నాకు అండగా నిలిచాడు. నేను కెప్టెన్ అయ్యాక కూడా అదే చేశా. మాహీ మాటకు చాలా గౌరవం ఇచ్చాను. అతను కెప్టెన్ ఆ.. లేక నేను కెప్టెన్ ఆ అనేది నేనెప్పుడూ ఆలోచించను...

ఎందుకంటే నాకు అతనెప్పుడూ మాహీయే. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత నేను జాతీయ జెండాను పట్టుకుని, మాహీని హత్తుకున్నాడు. మా ఇద్దరిపైన జాతీయ జెండా ఉంది. ఆ ఫోటో ఎప్పటికీ నాకు చాలా స్పెషల్.. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో నేను చిన్నోడిని...

ఆ మ్యాచ్ తర్వాత సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ అందరూ ఎమోషనల్ అయ్యారు. మాహీ కూడా సాధారణంగా ఎమోషనల్ కాడు, అయితే ఆ రోజు అతని కళ్లల్లో నీళ్లు చూశాను. అయితే నాకు వాళ్ల ఫీలింగ్ అర్థం కాలేదు. ఎందుకంటే నేను వాళ్ల పొజిషన్‌లో దేను... అయితే ఆ ఫీల్ మాత్రం వేరే లెవెల్‌గా ఉండింది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ...

click me!