వాళ్ల బౌలింగ్‌కి, మా బ్యాటింగ్‌కి మధ్య యుద్ధం... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్...

First Published | Oct 22, 2022, 5:59 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. దాయాదుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెప్టెన్‌గా మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు రోహిత్ శర్మ...

Image credit: PTI

గత ఆరు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో బరిలో దిగింది భారత జట్టు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో సూపర్ 12 రౌండ్ నుంచే నిష్కమించింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడి, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో దాయాది చేతుల్లో మొదటి పరాజయాన్ని చవి చూసింది...
 

Image credit: PTI

ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ఆడుతోంది టీమిండియా. ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో పాక్ చేతుల్లో ఓడిన భారత జట్టుకి ఈ మ్యాచ్ పరువు సమస్యగా మారింది. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి 90 వేలకు పైగా అభిమానులు హాజరు కాబోతున్నారు...


‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాకు ఎలాంటి ప్రెషర్ లేదు. దీన్ని కూడా ఓ సాధారణ మ్యాచ్‌గానే చూస్తున్నాం. పాకిస్తాన్‌ ఓ ఛాలెంజింగ్ టీమ్. అయితే ఆ రోజున ఎవరి పర్ఫామెన్స్ బాగుంటే వాళ్లే గెలుస్తారు. గత వరల్డ్ కప్‌లో వాళ్లు బాగా ఆడారు, గెలిచారు...

Image credit: PTI

పాకిస్తాన్ బౌలింగ్ చాలా పటిష్టంగా కనబడుతోంది. అయితే మా బ్యాటింగ్‌లో చాలా అనుభవం ఉంది. వాళ్ల బౌలింగ్‌కీ, మా బ్యాటింగ్‌కీ మధ్య అసలైన యుద్ధం.  ఇరు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ సాగుతుందని అనుకుంటున్నా... పాక్‌పై ఎలా బ్యాటింగ్ చేయాలి? ఎలా బౌలింగ్ చేయాలనే విషయాలపై బాగా చర్చించాం...

Rohit Sharma and KL Rahul

పాక్‌తో మ్యాచ్‌లో ఎవరు ఫెవరెట్లు? ఎవరు అండర్‌ డాగ్స్ అనే మాటలను నేను పట్టించుకోను. ఈ మెగా టోర్నీల్లో ఇలాంటి విషయాలు పెద్దగా వర్కవుట్ కావు. ఆ రోజు, ఆ సమయానికి ఎవరు బాగా ఆడితే వాళ్లే గెలుస్తారు... మైండ్‌ సెట్ మంచిగా ఉంటే చాలు...

భారత జట్టులో ఇప్పుడైతే ఎలాంటి గాయాలు లేవు. సెలక్ట్ అయిన 15 మంది పూర్తి ఫిట్‌గా ఉన్నారు. ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండాలనేది ఎప్పుడో డిసైడ్ చేశాం. అందులో ఎలాంటి మార్పులు ఉండవు... టీమ్‌లో కొందరు ఆస్ట్రేలియాకి తొలిసారి వచ్చారు...

అందుకే వారికి ఇక్కడి వాతావరణం అలవాటు పడాలనే ఉద్దేశంతో ముందుగానే వచ్చాం. ప్రిపరేషన్స్‌కి కావాల్సినంత సమయం దొరికింది. భారత్‌లో పిచ్‌లతో పోలిస్తే ఇక్కడ బౌండరీలు పెద్దవి. ఆస్ట్రేలియాలో మనవాళ్లు ఎలా ఆడతారో చూడాలి..’ అంటూ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ... 

Latest Videos

click me!