మాహీ భాయ్ ఈసారి చితక్కొడతాడు, ఎందుకంటే... రుతురాజ్ గైక్వాడ్ కామెంట్...

First Published Sep 13, 2021, 1:20 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచిన సీఎస్‌కే, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో సరిపెట్టుకుంది...

ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో మాత్రం సీఎస్‌కే అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. మొదటి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకున్న సీఎస్‌కే, లీగ్‌కి బ్రేక్ పడే సమయానికి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది...

గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, డుప్లిసిస్ వంటి విదేశీ స్టార్లతో పాటు యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా చక్కగా రాణిస్తున్నాడు...

‘మాహీ భాయ్ ఈసారి ఐపీఎల్‌లో చితక్కొడతాడని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆయనలో ఏదో కొత్త ఎనర్జీ కనిపిస్తోంది...

సీఎస్‌కే క్యాంపులో నేను మూడేళ్లుగా ఉంటున్నా. గత మూడు సీజన్లలోనూ మాహీ భాయ్‌లో ఈ ఎనర్జీ, జోష్ కనిపించలేదు...

ఈసారి మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌తో, ఎంతో పాజిటివ్‌ ఎనర్జీతో కనిపిస్తున్నాడు... ఇది లీగ్‌లోనూ కంటిన్యూ అయితే మేం టైటిల్ గెలిచేస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్...

ఐపీఎల్ 2020 ఆరంభానికి ముందు సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం, రుతురాజ్ గైక్వాడ్ కరోనా బారిన పడడంతో సీఎస్‌కే ఇబ్బందులు పడింది...

మొదటి రెండు మ్యాచుల్లో రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్ అవ్వడంతో అతనికి ఆ తర్వాత అవకాశాలు దక్కలేదు... సీనియర్లనే కొనసాగించాడు మాహీ...

ఓ మ్యాచ్‌ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో...‘యంగ్ ప్లేయర్లలో నాకు స్పార్క్ కనిపించడం లేదు...’ అంటూ మాహీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి...

వరుసగా ఫెయిల్ అవుతున్న కేదార్ జాదవ్, మురళీ విజయ్, పియూష్ చావ్లాలను ఆడిస్తూ కుర్రాళ్లలో స్పార్క్ లేదనడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి...

ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్, వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటుకున్నాడు...

రుతురాజ్ గైక్వాడ్ లీగ్ చివర్లో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా వరుస మ్యాచుల్లో గెలిచిన సీఎస్‌కే, పాయింట్ల పట్టికలో ఆఖరి ప్లేస్ నుంచి కాస్త పైకి రాగలిగింది..

రుతురాజ్ ప్రదర్శనతో ధోనీని ట్రోల్ చేశారు ఐపిఎల్ ఫ్యాన్స్... ‘ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా’ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేశారు...

ఈ ఏడాది ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 1లోనూ డుప్లిసిస్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి, సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు రుతురాజ్ గైక్వాడ్..

ఆ పర్ఫామెన్స్ కారణంగా లంక టూర్‌లో భారత జట్టు తరుపున టీ20ల్లో ఆరంగ్రేటం కూడా చేసిన రుతురాజ్, అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు....

click me!