ప్రపంచంలో అత్యంత ఆరాధించే టాప్-10 క్రీడాకారులలో విరాట్ కోహ్లీ

First Published | Sep 5, 2024, 8:24 PM IST

most admired top-10 players : మెస్సీ, రొనాల్డో, జొకోవిచ్, ఎంబాప్పే వంటి వారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆరాధించే టాప్ 10 క్రీడాకారులలో విరాట్ కోహ్లీ కూడా నిలిచాడు. బీబీసీ ర్యాంకింగ్ జాబితాలో క్రికెట్ నుంచి ఒకే ఒక్క‌డు ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. 
 

most admired top-10 players-Virat Kohli : భార‌త స్టార్ క్రికెట‌ర్ ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు కేవ‌లం క్రికెట్ గ్రౌండ్ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. మైదానం వెలుపల కూడా అతను కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. కింగ్ కోహ్లీ కేవ‌లం భారత క్రికెట్‌కు ముఖం మాత్రమే కాదు.. ప్రస్తుతం ప్ర‌పంచ క్రికెట్ కు దిక్సూచిగా మారాడు. 

బీబీసీ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ఆరాధించే టాప్-10 క్రీడాకారులలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. క్రికెట్ నుంచి ఈ జాబితాలో చోటుద‌క్కించుకున్న ఒకే ఒక్క‌డు విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీ ఈ లిస్టులో 6వ స్థానంలో ఉన్నాడు.

లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో , లెబ్రాన్ జేమ్స్, నొవాక్ జొకోవిచ్, కైలియన్ ఎంబాప్పే మొదలైన స్టార్ ఆట‌గాళ్ల జాబితాలో చేరిన ఏకైక క్రికెటర్ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కేవలం క్రికెటర్లకే కాదు ఇతర క్రీడాకారులకు కూడా కోహ్లీ స్ఫూర్తిదాయకుడు.

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ ఈవెంట్‌లో పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 ఫైనల్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని మిలియన్ల హృదయాలను గెలుచుకున్న భారత షట్లర్ నితీష్ కుమార్‌కు విరాట్ కోహ్లీకి కనెక్షన్ ఉంది.  

జియో సినిమాతో చాట్ సెషన్‌లో నితీష్ కుమార్ మాట్లాడుతూ "విరాట్ కోహ్లీ నా హీరో, ఎందుకంటే అతను ఫిట్‌గా ఉండటానికి తన శక్తి, ప్రయత్నాన్ని అందించే విధానం నిజంగా స్ఫూర్తిదాయకం. అందుకే అత‌ను నా హీరో అంటూ త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. 


బీబీసీ ప్ర‌క‌టించిన ఈ ర్యాంకింగ్స్ కోహ్లీ విజ‌యాల‌ను హైలెట్ చేయ‌డంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ ఆట‌కు పెరుగుతున్న ప్రపంచ స్థాయిని ప్రతిబింబిస్తుంది. ఈ క్రీడ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడం కొనసాగిస్తున్నందున దాని ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా కోహ్లీ హోదా మరింత సుస్థిరమైంది.

భారత్‌లో అత్యధికంగా పన్ను చెల్లించే క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి

మార్చి 31, 2024న ముగిసిన మునుపటి ఆర్థిక సంవత్సరంలో విరాట్ కోహ్లీ దేశం నుండి అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ షేర్ చేసిన డేటా ప్రకారం.. స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రూపంలో రూ. ₹66 కోట్లు చెల్లించాడు. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల బ్యాట్స్‌మన్ సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు.

2024 నాటికి, విరాట్ కోహ్లీ నికర విలువ ₹1,000 కోట్లు (సుమారు $127 మిలియన్లు)గా అంచనా వేయబడింది. విరాట్ కోహ్లీ సంపద ప్రాథమికంగా అతని క్రికెట్ కెరీర్ నుండి వచ్చింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)తో ఒప్పందాలు, అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడ‌టం తో విరాట్ కోహ్లీ భారీ మొత్తాలను సంపాదిస్తున్నాడు. 

అలాగే, విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ ప్ర‌పంచ వ్యాప్తంగా టాప్ లో కొన‌సాగుతోంది. భార‌త్ లో అత్య‌ధిక బ్రాండ్ విలువ క‌లిగిన వ్య‌క్తిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. బాలీవుడ్ స్టార్ల‌ను కూడా వెన‌క్కి నెట్టాడు. దీంతో కింగ్ కోహ్లీ క్రికెట్ ఆదాయంతో పాటు, టాప్ గ్లోబల్ బ్రాండ్‌లతో అనేక ఒప్పందాల నుంచి కూడా భారీగా డ‌బ్బ‌ను సంపాదిస్తున్నారు. 

ప్రపంచంలో అత్యంత అభిమాన టాప్-10 క్రీడాకారుల జాబితాలో అర్జెంటీనా కెప్టెన్ ఫుట్ బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత పోర్చుగల్ కెప్టెన్, ఫుట్ బాట్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ ఉన్నాడు. 

సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిక్ అత్యధిక అభిమానులు కలిగిన నాల్గో ప్లేయర్ గా నిలిచాడు. గాయాలు, వివాదాల నడుమ నిలిచిన బ్రెజిలియన్ సూపర్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్  నెయ్మార్ ఐదో స్థానంలో ఉన్నాడు. టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ భారత స్టార్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ. అతను ఆరో స్థానంలో ఉన్నాడు.

అమెరికన్ గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. స్పెయిన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు రాఫెల్ నాదల్ ఫెదరర్ తర్వాత తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. రియల్ మాడ్రిడ్‌లో చేరిన ఫ్రెంచ్ సూపర్‌స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే పదో స్థానంలో ఉన్నాడు.
 

Latest Videos

click me!