ఆ ఇద్దరి వల్లే సిరాజ్ పర్ఫామెన్స్ దెబ్బతిందా... విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అలా అదరగొట్టి...

Published : Jun 02, 2022, 04:26 PM ISTUpdated : Jun 02, 2022, 04:27 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం మహ్మద్ సిరాజ్ ఫామ్... గత రెండు సీజన్లలో ప్రత్యర్థి బ్యాటర్‌కు చుక్కలు చూపించిన సిరాజ్, ఈ సీజన్‌లో తానే వాటిని చూడాల్సి వచ్చింది. ఎకానమీతో బౌలింగ్ చేయలేక, వికెట్లు తీయలేక తెగ ఇబ్బందిపడ్డాడు మహ్మద్ సిరాజ్...  

PREV
18
ఆ ఇద్దరి వల్లే సిరాజ్ పర్ఫామెన్స్ దెబ్బతిందా... విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అలా అదరగొట్టి...

ఐపీఎల్ 2020 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 8 పరుగులు మాత్రమే ఇచ్చిన మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు...

28
Mohammed Siraj

తొలి టెస్టులో మహ్మద్ షమీ గాయపడి తప్పుకోవడంతో మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో టెస్టు ఆరంగ్రేటం చేసిన మహ్మద్ సిరాజ్, బ్రిస్బేన్‌లో జరిగిన ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి అదరగొట్టాడు...

38

అప్పటి నుంచి భారత టెస్టు టీమ్‌లో కీలక సభ్యుడిగా మారిపోయిన మహ్మద్ సిరాజ్... వన్డే ఫార్మాట్‌లోనూ రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. అలాంటి సిరాజ్, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫెయిల్ అవ్వడంతో రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మలపై ట్రోల్స్ రావడం విశేషం...

48

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్, శ్రీలంక, వెస్టిండీస్‌‌లతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లకు మహ్మద్ సిరాజ్‌ని ఎంపిక చేసినా, తుదిజట్టులో చోటు ఇవ్వలేదు...

58
Mohammed Siraj

వన్డే, టీ20 సిరీస్‌లోనే కాదు స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మహ్మద్ సిరాజ్‌కి అవకాశం రాలేదు. ఇదే సిరాజ్ పర్ఫామెన్స్‌ని తీవ్రంగా దెబ్బ తీసి ఉంటుందని భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

68
mohammed siraj

మహ్మద్ సిరాజ్ లాంటి పేసర్‌ని ఫామ్‌లో ఉన్నప్పుడే వరుసగా ఆడిస్తూ, అతను మరింత రాటుతేలేలా చేసుకోవాలి. అద్భుతంగా ఆడుతున్న ప్లేయర్‌ని కాదని పక్కనబెట్టడం వల్ల ఫామ్‌ కోల్పోయే ప్రమాదం ఉంటుంది...

78

ఇంతకుముందు భారత సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలోనూ ఇదే జరిగిందని, ఇప్పుడు మహ్మద్ సిరాజ్‌ని కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చొబెట్టి ఇలా తయారుచేశారని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలను ట్రోల్ చేస్తున్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్...

88
Mohammed Siraj

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచులు ఆడి 11 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, 6.78 ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచిన విషయాన్ని మరిచిపోకూడదని గుర్తు చేస్తున్నారు..

Read more Photos on
click me!

Recommended Stories