Umran Malik: ఉమ్రాన్ ను చూడగానే ఆ పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ గుర్తుకొచ్చాడు.. బ్రెట్ లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Jun 02, 2022, 04:11 PM IST

Umran Malik: ఐపీఎల్-2022 లో తన వేగంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు ఉమ్రాన్ మాలిక్.  ఈ జమ్మూ కుర్రాడు ఇప్పుడు టీమిండియాకు కూడా ఆడబోతున్నాడు. 

PREV
17
Umran Malik: ఉమ్రాన్ ను చూడగానే ఆ పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ గుర్తుకొచ్చాడు.. బ్రెట్ లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐపీఎల్-15లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్ పై ఆసీస్ పేస్ దిగ్గజం బ్రెట్ లీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని చూడగానే  తనకు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకొచ్చాడని  అన్నాడు. 

27

ఐపీఎల్ రెండో సీజన్ ఆడుతున్నఉమ్రాన్ మాలిక్..  ఈ లీగ్ లో మూడో అత్యంత వేగవంతమైన డెలివరీ (గంటకు 157 కి.మీ) ని సంధించి చరిత్ర సృష్టించాడు.  ప్రతి మ్యాచ్ లో గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంగా బంతులు విసిరాడు. ఐపీఎల్ లో ఆకట్టుకున్న అతడిని టీమిండియాలోకి తీసుకుంది బీసీసీఐ. 

37

తాజాగా ఉమ్రాన్ మాలిక్ గురించి బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘నేను అతడి (ఉమ్రాన్) కి  అభిమానిని. అతడిలో చాలా సత్తా దాగి ఉంది. క్రికెట్ లో పాత తరపు ఫాస్ట్ బౌలర్లు పరిగెత్తినంత వేగంగా పరిగెడుతున్నాడు. 

47

ఉమ్రాన్ రన్నింగ్ యాక్షన్, అతడి వేగం చూసిన తర్వాత నాకు పాకిస్తాన్  దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ గుర్తుకువచ్చాడు. అయితే రనప్ విషయంలో ఉమ్రాన్ తనను తాను మెరుగుదిద్దుకోవాలి. 

57

మణికట్టు ద్వారా బౌలింగ్ చేసే సరళి, రన్నింగ్ యాక్షన్, బంతి విసిరేప్పుడు చేయి ఏ విధంగా ఉండాలనే దానిమీద అతడు నేర్చుకోవాల్సింది ఉంది.  కానీ గొప్ప విషయం ఏమిటంటే ఒక బౌలర్ బౌలింగ్ యాక్షన్ ఎప్పటికీ పర్ఫెక్ట్ గా ఉండదు. 
 

67

వేరేవాళ్లదాకా ఎందుకు..? నా బౌలింగ్ యాక్షన్ లో కూడా లోపాలున్నాయి. కానీ నేను నా కెరీర్ లో చివరి బంతి వేసే వరకు అత్యుత్తమ బంతుల్నే విసరగలిగాను.  ఆ రోజుల్లో నిత్యం నా బౌలింగ్ యాక్షన్ మీద ఎక్కువ దృష్టి సారించేవాన్ని. అలా ప్రతిరోజు   నా  నైపుణ్యాన్ని మెరుగు దిద్దుకునేవాడిని..’ అని తెలిపాడు. 

77

ఈ సీజన్ లో ఉమ్రాన్ మాలిక్.. 14 మ్యాచులాడి 22 వికెట్లు పడగొట్టాడు. పలు సందర్భాల్లో భారీగా పరుగులిచ్చుకున్నా.. తర్వాత మాత్రం బంతిపై నియంత్రణ సాధించాడు. సీజన్ అంతా రాణించడంతో అతడికి ఈ ఐపీఎల్-15 లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా దక్కింది. 

click me!

Recommended Stories