షమీని ఇంట్లో ఎందుకు కూర్చొబెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు : టీమిండియా మాజీ హెడ్ కోచ్ కామెంట్స్

First Published Sep 7, 2022, 11:19 AM IST

Asia Cup 2022: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో టీమిండియా తుది జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగో పేసర్ లేని లోటును  విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. 

Image credit: Getty

ఆసియా కప్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగిన భారత జట్టు కనీసం ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టింది. సూపర్-4లో వరుసగా రెండు మ్యాచులు ఓడి ఫైనల్ అవకాశాలను కోల్పోయింది. అయితే ఈ రెండు మ్యాచులలో టీమిండియా తుది జట్టు సెలక్షన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జట్టు ఎంపికపై టీమిండియా సారథి రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్  అనుసరిస్తున్న తీరుపై విమర్శకులు  మండిపడుతున్నారు. జట్టులో నాలుగో పేసర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని, యూఏఈలోని పరిస్థితుల మీద అవగాహన ఉండి కూడా ఇలా చేయడమేమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదే విషయమై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా లంకతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కామెంట్రీ చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలర్లను లంక బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కుంటున్న తరుణంలో   కామెంట్రీ చెబుతున్న  శాస్త్రి.. ‘మీరు మ్యాచులు గెలవాలని భావిస్తే అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అయి ఉండాలి. నాకు తెలిసి గత రెండు మ్యాచ్ లలో భారత జట్టు సెలక్షన్ మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది. 
 

మరీ ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల విషయంలో అయితే నేను ఈ మాట కచ్చితంగా చెప్పగలను. మీకు (టీమిండియా) ఇక్కడి పరిస్థితుల గురించి బాగా తెలుసు.  ఇక్కడ  స్పిన్నర్ అవసరం చాలా తక్కువ. ఇటువంటి సందర్భాల్లో మనకు నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ ఉంటే మ్యాచ్ ఫలితం వేరే ఉండేది.  
 

భారత్ మహ్మద్ షమీని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు. అతడిని తాపీగా ఇంట్లో ఎందుకు కూర్చోబెడుతున్నారు..? నన్ను ఇది  ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున  రాణించిన షమీని జాతీయ జట్టుకు ఎందుకు తీసుకోవడం లేదో నాకు అర్థంకావడం లేదు’ అని అన్నాడు.

Mohammed Shami

దీనికి శాస్త్రి పక్కనే కామెంట్రీ చెబుతున్న పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ స్పందిస్తూ.. ‘మీరు హెడ్ కోచ్ గా ఉన్నారు. నిజంగా  జట్టు ఎంపికలో కోచ్ లకు మాట్లాడే అవకాశం ఉంటుందా..? వాళ్ల సూచనలు సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారా..?’ అని అడిగాడు. 
 

యూఏఈ పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేసేప్పుడే జట్టులో ఒక స్పిన్నర్ ను ఎంపిక చేస్తే సరిపోతుందని శాస్త్రి అన్నాడు.  ‘నలుగురు పేసర్లు ఉంటే ఈ పిచ్ లలో మ్యాచ్ లు గెలిచే అవకాశముంటుంది. అలా కాక ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగడం పెద్దగా ఉపయోగముండదు.  అలా అయితే ఇదితో ఇలాంటి ఫలితాలే వస్తాయి..’ అని  శాస్త్రి చెప్పాడు. 

ఆసియా కప్-2022 కు భారత జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగింది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మినహా  జట్టులో అనుభవం గల స్పెషలిస్టు బౌలర్ లేడు. అర్ష్దీప్ తో పాటు అవేశ్ ఖాన్ లు ఇప్పుడే కెరీర్ ఆరంభదశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో షమీని ఎంపిక చేసుంటే బాగుండేదని విమర్శకుల వాదన. 

click me!