Surya Kumar Yadav
India vs England T20 Series: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఇంగ్లండ్ తో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టనుంది. కాబట్టి టీమిండియాకు ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ చాలా ముఖ్యమైంది.
జట్టులోకి తిరిగి వచ్చిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ
టీమిండియా సీనియర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. దాదాపు 13 నెలల తర్వాత భారత క్రికెట్ జట్టులోకి ఈ స్టార్ పేసర్ తిరిగి వచ్చాడు. అంతకుముందు షమీ నవంబర్ 2023లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడాడు.
అప్పటి నుంచి అతను గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. వన్డే ప్రపంచ కప్ లో షమీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు. భారత్ తరఫున 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన షమీ 24 వికెట్లు పడగొట్టాడు.
షమీకి శస్త్రచికిత్స..
చీలమండ గాయం కారణంగా షమీ చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. శస్త్ర చికిత్స చేయించుకుని తిరిగి దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చాడు. 34 ఏళ్ల షమీ రంజీ ట్రోఫీలో క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. టీ20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడాడు. అక్కడ మంచి ప్రదర్శనలు ఇచ్చాడు.
అయితే, మోకాలి వాపు కారణంగా అతను ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులో భాగం కాలేకపోయాడు. నవంబర్ 2022 తర్వాత షమీ మళ్లీ టీ20లో ఆడనున్నాడు. అతను టీ20 ప్రపంచ కప్ 2022 నుండి క్రికెట్ పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు ఆడలేకపోయాడు.
ధృవ్ జురెల్ తో రిషబ్ పంత్‌కు షాక్
ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. అతని కంటే ధృవ్ జురెల్‌కు ప్రాధాన్యత ఇచ్చింది.
సంజూ శాంసన్ తర్వాత అతను జట్టుకు రెండో వికెట్ కీపర్ గా తీసుకుంది. జితేష్ శర్మ స్థానంలో జురెల్ ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతాలు చేసిన నితీశ్ కుమార్ రెడ్డి మళ్లీ టీ20 జట్టులోకి వచ్చాడు. రమణదీప్ సింగ్ స్థానంలో రెడ్డి ఎంపికయ్యారు. మరో ఆల్ రౌండర్ శివమ్ దూబేను కూడా జట్టు నుంచి ఔట్ చేశారు.
Rinku Singh, Nitish Reddy
అభిషేక్, రింకూ సింగ్ లకు దక్కిన చోటు
జట్టులో అభిషేక్ శర్మకు చోటు దక్కింది. టీ20 ఇంటర్నేషనల్‌లో అతనికి మంచి ఆరంభం అందింది. ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ లు రాకపోవడంతో అతను జట్టు నుంచి ఔట్ అయ్యే పరిస్థితిలోకి వెళ్లాడు. తన రెండో మ్యాచ్‌లో సెంచరీ చేసిన అభిషేక్.. వరుసగా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 50 పరుగులకు చేరుకోలేకపోయాడు. అతను దక్షిణాఫ్రికాలో తన చివరి రెండు ఇన్నింగ్స్‌లలో 50, 36 పరుగులు చేశాడు.
భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్) , రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.
Axar Patel
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ షెడ్యూల్:
మొదటి మ్యాచ్ - 22 జనవరి - కోల్‌కతా
రెండో మ్యాచ్ - 25 జనవరి - చెన్నై
మూడో మ్యాచ్ - 28 జనవరి - రాజ్‌కోట్
నాలుగో మ్యాచ్ - 31 జనవరి - పూణే
ఐదవ మ్యాచ్ - 2 ఫిబ్రవరి - ముంబై.