సారీ సర్... మాకు మరో గత్యంతరం లేదు! వద్దని పక్కనబెట్టిన మహ్మద్ షమీవైపే చూస్తున్న టీమిండియా...

Published : Sep 12, 2022, 11:23 AM ISTUpdated : Sep 12, 2022, 11:27 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. టెస్టులు, వన్డేల్లో మహ్మద్ షమీని కొనసాగించిన భారత జట్టు, పొట్టి ఫార్మాట్‌కి మాత్రం అతన్ని పక్కనబెట్టింది. అయితే మరో గత్యంతరం లేక మళ్లీ షమీవైపే చూస్తోందట టీమిండియా...

PREV
17
సారీ సర్... మాకు మరో గత్యంతరం లేదు! వద్దని పక్కనబెట్టిన మహ్మద్ షమీవైపే చూస్తున్న టీమిండియా...
Image credit: PTI

జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ అందుబాటులో లేకపోయినా భువనేశ్వర్ కుమార్‌తో పాటు జూనియర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌లతో ఆసియా కప్ 2022 టోర్నీ ఆడింది భారత జట్టు. టైటిల్ ఫెవరెట్‌గా ఆసియా కప్ 2022 టోర్నీని మొదలెట్టిన టీమిండియా, సూపర్ 4 స్టేజీని దాటలేకపోయింది.

27
Image credit: PTI

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 180+, శ్రీలంకతో మ్యాచ్‌లో 170+ పరుగుల స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేవడంలో విఫలమైంది భారత జట్టు. సీనియర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు యంగ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు...

37

గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్... ఫిట్‌నెస్ట్ టెస్టులను క్లియర్ చేశారు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఈ ఇద్దరూ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ముందుజాగ్రత్తగా మహ్మద్ షమీని కూడా తిరిగి టీ20ల్లోకి తేవాలని భావిస్తోందట బీసీసీఐ...

47

షమీపై వర్క్‌లోడ్ తగ్గించేందుకు అతన్ని టీ20లకు దూరం పెట్టామని చెప్పిన భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్, మరో గత్యంతరం లేక సీనియర్ పేసర్‌ని తిరిగి పొట్టి ఫార్మాట్‌లోకి రప్పించాలని భావిస్తోందట...

57

ఆసియా కప్ 2022 టోర్నీ తర్వాత భారత జట్టు ఆడే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లకు మహ్మద్ షమీని ఎంపిక చేస్తే... టీ20 వరల్డ్ కప్ 2022 సమయానికి అవసరమయ్యే ప్రాక్టీస్ కలుగుతుందని భావిస్తోందట బీసీసీఐ...

67

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్‌లో 17 పరుగులు రాబట్టాడు పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్. ఈ మ్యాచ్ తర్వాత అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేశాడు మహ్మద్ షమీ... 

77

అయితే సీనియర్ పేసర్ మహ్మద్ షమీని తిరిగి తీసుకురావడం కంటే ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింగ్స్ టీమ్ తరుపున అదరగొట్టిన మోహ్సిన్‌ ఖాన్‌కి అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుందని అంటున్నారు మరికొందరు...

click me!

Recommended Stories