టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లను కూడా షమీ కోల్పోయారు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత, షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో నెట్స్‌లో బౌలింగ్ ప్రారంభించారు. అయితే, మహమ్మద్ షమీ మోకాలిలో వాపు రావడంతో బీసీసీఐ సెలెక్టర్లు, టీమిండియా యాజమాన్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇది అతని అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీని మరింత ఆలస్యం చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టుల కోసం షమీ భారత జట్టులో చేరాలని భావించారు. అయితే, అంతర్జాతీయ పునరాగమనం చేయడానికి ఫిట్ గా లేడని బీసీసీఐ వైద్య బృందం ప్రకటించింది. దీంతో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో షమీ ఆడలేకపోయాడు.