ఇంకా కోలుకోని షమీ.. జమ్మూ ఎక్స్‌ప్రెస్‌కు కబురు పంపిన సెలక్టర్లు

First Published Sep 26, 2022, 11:45 AM IST

IND vs SA T20I:  ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన వెంటనే  టీమిండియా  దక్షిణాఫ్రికా తో కూడా మూడు టీ20 లు ఆడనుంది. ఈ సిరీస్ కు  ఎంపికైన మహ్మద్ షమీ   ఇంకా కోలుకోకపోవడం భారత్ కు ఆందోళనకు గురి చేస్తున్నది. 

Image credit: Getty

టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ  ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై బౌలర్ గా ఎంపికయ్యాడు. కానీ అంతకుముందే స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు గాను 15 మంది  సభ్యులలో  షమీ కూడా ఉన్నాడు.  
 

కానీ ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు షమీ కరోనా కారణంగా దూరమయ్యాడు. అయితే వారం రోజులు గడుస్తున్నా షమీ ఆరోగ్యంపై సమాచారమేమీ లేదు. అతడు కోలుకున్నాడా..? లేదా..? కోలుకుంటే మ్యాచ్ కు ఫిట్ గా ఉన్నాడా..? అనే విషయాల మీద స్పష్టత లేదు. 

కానీ సౌతాఫ్రికాతో ఈ నెల28 నుంచే  మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో  సెలక్టర్లు  షమీ లేకుంటే ఎలా..? అనే ఆలోచనలో పడ్డారు. మ్యాచ్ కు మరో రెండ్రోజులు మాత్రమే సమయం ఉండటంతో స్టాండ్ బై ను ఎంపిక చేయడమే బెటరనే అభిప్రాయంలో ఉన్నారు. 

అయితే ఆసీస్ సిరీస్ కు షమీ స్థానాన్ని  ఉమేశ్ యాదవ్ తో భర్తీ చేయించారు సెలక్టర్లు. కానీ  మొహాలీ లో ముగిసిన తొలి మ్యాచ్ లో ఉమేశ్ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. దీంతో తర్వాత రెండు మ్యాచ్ లకు అతడిని ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికా సిరీస్ కు కూడా అతడిని పక్కనపెట్టడమే బెటరనే అభిప్రాయంలో సెలక్టర్లున్నారు. 

ఉమేశ్ ను కాకుండా ఈ సిరీస్ లో షమీ స్థానాన్ని జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారని తెలుస్తున్నది.  షమీ గనక సఫారీ సిరీస్ కు అందుబాటులో ఉండటని నిర్ధారించుకున్నాక  ఉమ్రాన్ మాలిక్ పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.  

Image credit: PTI

ఈ మేరకు ఉమ్రాన్ కు సెలక్టర్లు ఇప్పటికే సమాచారం కూడా అందించినట్టు తెలుస్తున్నది. ఉమ్రాన  ప్రస్తుతం ఇండియా ఏ వర్సెస్ న్యూజిలాండ్ ఏ  వన్డే సిరీస్ కోసం చెన్నైలో ఉన్నాడు. బీసీసీఐ నుంచి కాల్ వచ్చిన తర్వాత క్షణం ఉమ్రాన్  టీమిండియాతో కలవడానికి సిద్ధంగా ఉన్నాడు.   దక్షిణాఫ్రికాతో తొలి టీ20 జరిగేది తిరువనంతపురం (కేరళ) లోనే కాబట్టి చెన్నై నుంచి అక్కడికి వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. 

సౌతాఫ్రికా సిరీస్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా 
 

click me!