అతను లేకపోవడంతో టీమిండియా వీక్ అయిందనుకున్నాం, కానీ! ఆస్ట్రేలియా హెడ్ కోచ్ కామెంట్స్...

First Published Sep 26, 2022, 11:42 AM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ షో తర్వాత ఆస్ట్రేలియాపై స్వదేశంలో టీ20 సిరీస్ గెలిచింది భారత జట్టు. మొహాలీ వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి టీ20 సిరీస్‌ని 1-2 తేడాతో కైవసం చేసుకుంది. దీనిపై ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ స్పందించాడు...

ఆసియా కప్ 2022 టోర్నీలో రవీంద్ర జడేజా గాయపడడంతో టీమిండియాకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జడ్డూ మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోనూ అతనికి చోటు దక్కలేదు...

రవీంద్ర జడేజా గాయంతో జట్టుకి దూరం కావడం, మరోవైపు యజ్వేంద్ర చాహాల్ సరైన ఫామ్‌లో లేకపోవడంతో టీమిండియాకి కష్టాలు తప్పవని అనుకున్నారంతా. అయితే జడ్డూ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్, అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై సత్తా చాటాడు...

మొహాలీలో జరిగిన మొదటి టీ20లో 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన అక్షర్ పటేల్, నాగ్‌పూర్‌లో వర్షం కారణంగా 8 ఓవర్ల పాటు జరిగిన రెండో టీ20లో 2 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు...

Image credit: PTI

హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ20లోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు అక్షర్ పటేల్. 4 ఓవర్లలో 33 పరుగులిచ్చిన అక్షర్ పటేల్, 3 వికెట్లు తీశాడు. మొత్తంగా 3 మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది...

Image credit: PTI

‘అక్షర్ పటేల్ ఈ సిరీస్‌లో అద్భుతంగా ఆడాడు. రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోవడంతో టీమిండియా వీక్ అయిందని అనుకున్నాం. కానీ జడ్డూ ప్లేస్‌లో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. ప్రతీ ప్లేయర్‌కి టీమిండియా దగ్గర ఆప్షన్లు ఉన్నాయి...

ఈ సిరీస్‌లో అన్నీ హై స్కోరింగ్ మ్యాచులే జరిగాయి. మేం అనుకున్న ప్లాన్స్ కొన్ని కరెక్టుగా వర్కవుట్ అయ్యాయి. బాల్‌ని బ్యాటు డామినేట్ చేసింది. ఇక్కడి పిచ్‌లతో పోలిస్తే ఆస్ట్రేలియాలో పిచ్‌లు పూర్తిగా డిఫరెంట్. అక్కడ బౌన్స్ ఎక్కువగా ఉంటుంది...

Image credit: PTI

సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. వరల్డ్ కప్‌లో అతను డేంజరస్‌గా మారతాడు. అతనేం చేయగలడో చూపించాడు. సూర్యకుమార్ యాదవ్‌ని అడ్డుకోవడానికి ప్లాన్స్ రచించాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్...

click me!