గంగూలీ ఫెయిల్ అయితే అలా చేశారు, విరాట్ కోహ్లీ విషయంలో చేయలేరా... ఫ్యాన్స్ డిమాండ్...

First Published Aug 26, 2021, 3:29 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిలైడ్‌లో ఆడిన టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయ్యి చెత్తరికార్డు మూట కట్టుకుంది. ఆ ఘోర పరాజయం తర్వాత అద్భుత విజయాలతో కమ్‌బ్యాక్ ఇచ్చినా, లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలడంతో మరోసారి విరాట్ కోహ్లీని అసహనపు గాలులు తాకుతున్నాయి.

టీమిండియాకి దూకుడు మంత్రం నేర్పించిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దాదా కెప్టెన్సీలో భారత జట్టు, విదేశాల్లో కూడా అద్భుత విజయాలు అందుకుని టాప్ టీమ్‌గా ఎదిగింది. అలాంటి సౌరవ్ గంగూలీ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయని కారణంగా కొంతకాలం టీమ్‌‌లో చోటు కోల్పోవాల్సి వచ్చింది.

లార్డ్స్‌లో సెంచరీతో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ, ఒకానొకదశలో ఒంటిచేత్తో టీమిండియాకి ఎన్నో విజయాలను అందించాడు. అయితే 2003 వన్డే వరల్డ్‌కప్ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు సౌరవ్ గంగూలీ.

దాదా బ్యాటింగ్‌ను మ్యాగీ న్యూడుల్స్‌ తయారీ చేయడంతో పోల్చారు గంగూలీ. సరిగ్గా రెండంటే రెండే నిమిషాలు గంగూలీ క్రీజులో ఉంటున్నాడని తీవ్రమైన విమర్శలు వచ్చాయి...  

గ్రెగ్ చాపెల్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించాడు. ఆ తర్వాత జట్టులో కూడా అతనికి చోటు కరువైంది...

ఫామ్‌లో లేక, పరుగులు చేయలేక... జట్టుకి భారంగా మారడంతో అప్పటివరకూ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందించిన సౌరవ్ గంగూలీ వంటి నాయకుడినే తప్పించాల్సి వచ్చింది. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో బీసీసీఐ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు అభిమానులు...

సౌరవ్ గంగూలీలాగే, విరాట్ కోహ్లీలాగే ఓ లెజెండరీ బ్యాట్స్‌మెన్, అద్భుతమైన నాయకుడు కూడా. అయితే రెండేళ్లుగా జట్టుకి విజయాలు దక్కుతున్నా, బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ మాత్రం సరైన ప్రదర్శన ఇవ్వడంలో వరుసగా విఫలమవుతున్నాడు...

మూడేళ్ల కిందటి వరకూ మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఆ మార్కు అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు. గత 50 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు...

ఇంగ్లాండ్ టూర్‌లో అయితే నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిసి 69 పరుగులు మాత్రమే చేయగలిగాడు విరాట్ కోహ్లీ. అతని సగటు 17.25 మాత్రమే. కోహ్లీ కంటే మహ్మద్ షమీ, బుమ్రా వంటి బౌలర్లు మెరుగ్గా పరుగులు చేశాడంటే అతని ఫామ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...

ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్న పరిస్థితి కంటే అప్పుడు సౌరవ్ గంగూలీ కాస్త మెరుగైన పొజిషన్‌లోనే ఉన్నాడు. అయితే ఆనాటి కోచ్ గ్రెగ్ చాపెల్ జట్టును పటిష్టంగా చేయడానికి దాదాని పక్కనబెట్టేందుకు కూడా వెనకాడలేదు. ఇప్పటి కోచ్ రవిశాస్త్రి, కేవలం విరాట్ కోహ్లీకి పర్సనల్ అసిస్టెంట్‌గా మాత్రమే ఉంటున్నాడనే విమర్శలు ఉన్నాయి...

ఒకప్పుడు తాను కెప్టెన్ కావడం వల్ల పరుగులు చేసినా, చేయకపోయినా జట్టులో తన స్థానానికి ఢోకా లేదనే ధీమా, సౌరవ్ గంగూలీలో స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇదే కనిపిస్తోందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

టీమిండియాకి ఎన్నో విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు విశ్రాంతి అవసరం. సెంచరీలు అందుకోలేకపోయినా, కనీస పరుగులు చేయలేకపోతున్న కోహ్లీ, బ్యాటింగ్‌పై సరైన ఫోకస్ పెట్టాలంటే అతనిపై సీరియస్ చర్యలు తీసుకోవాలని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

click me!