ఇషాంత్ శర్మ స్థానంలో మహ్మద్ సిరాజ్... ఆ ఇద్దరి ప్లేస్‌పై ఇంకా రాని క్లారిటీ...

Published : Jul 09, 2021, 01:23 PM IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు టీమిండియాలో కొన్ని మార్పులు అనివార్యం కానున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో గాయపడిన ఇషాంత్ శర్మ స్థానంలో మహ్మద్ సిరాజ్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది...

PREV
112
ఇషాంత్ శర్మ స్థానంలో మహ్మద్ సిరాజ్... ఆ ఇద్దరి ప్లేస్‌పై ఇంకా రాని క్లారిటీ...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్ చేస్తూ, బ్యాట్స్‌మెన్ కొట్టిన స్ట్రైయిట్ షాట్‌ను ఆపబోయి గాయపడ్డాడు. అతని వేళ్ల నుంచి రక్తం రావడంతో ఇషాంత్ శర్మ ఓవర్‌ను షమీతో వేయించాల్సి వచ్చింది...

212

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆరంభానికి ఇంకా 25 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇషాంత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో అతని స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను ఆడించాలని చూస్తోంది భారత జట్టు...

312

స్వింగ్‌కి బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై ఫామ్‌లో లేని జస్ప్రిత్ బుమ్రాకి బదులుగా మహ్మద్ సిరాజ్‌ని ఆడించి ఉంటే, మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేదని ఫైనల్ సమయంలో భారత జట్టుపై విమర్శలు వచ్చాయి...

412

ఆస్ట్రేలియా టూర్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్, ‘గబ్బా’లో జరిగిన ఆఖరి టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు...

512

ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన మహ్మద్ సిరాజ్... ఇప్పటిదాకా 5 టెస్టులు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 3 కంటే తక్కువగానే ఉంది...

612

‘ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరినీ ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడించాలని చూసినా, ఇషాంత్ శర్మ స్థానంలో మహ్మద్ సిరాజ్ ఆడతాడు...’ అంటూ బీసీసీఐ అధికారి తెలియచేశారు...

712

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రవీంద్ర జడేజా... తుది జట్టులో ఉండడం అనుమానంగానే మారింది...

812

అతని స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌ని ఆడించాలని సూచిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇంగ్లాండ్ పిచ్‌లు స్వింగ్‌కి అద్భుతంగా అనుకూలిస్తున్నాయి...

912

బుమ్రా, షమీలతో పోలిస్తే శార్దూల్ ఠాకూర్ బంతిని స్వింగ్ చేయగలడు. కాబట్టి శార్దూల్ ఠాకూర్‌కి అవకాశం ఇస్తే లోయర్ ఆర్డర్‌లో పరుగులు చేయడమే కాకుండా అదనపు బౌలర్‌గానూ ఉపయోగపడతాడని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

1012

అలాగే ఫైనల్‌లో ఫెయిల్ అయిన ఛతేశ్వర్ పూజారా విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ సీరియస్‌గా ఉందని సమాచారం. అయితే ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టుల్లో పూజారాకి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది...

1112

ఫైనల్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన తీసి పక్కనబెట్టడం సరికాదని భావిస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్, పూజారాని మొదటి రెండు టెస్టులు ఆడించి, వాటిల్లో కూడా ఫెయిల్ అయితే.. అతని స్థానంలో కెఎల్ రాహుల్, హనుమ విహారిలకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం..

1212

అలాగే ఫైనల్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జస్ప్రిత్ బుమ్రా, తొలి రెండు టెస్టుల్లో తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతే అతని స్థానంలో ఉమేశ్ యాదవ్, యంగ్ బ్యాకప్ బౌలర్ ఆవేశ్ ఖాన్‌లకు అవకాశం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది భారత జట్టు...

click me!

Recommended Stories