మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా కంటే చాలా టాలెంటెడ్... ఆశీష్ నెహ్రా సంచలన కామెంట్...

Published : Apr 24, 2021, 06:04 PM IST

జస్ప్రిత్ బుమ్రా... గత నాలుగేళ్లుగా టీమిండియాలో స్టార్ పేసర్‌గా మారిన బౌలర్. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న భారత సూపర్ స్టార్ పర్ఫామర్. మహ్మద్ సిరాజ్... గత ఆస్ట్రేలియా టూర్ నుంచే అదరగొడుతున్న హైదరాబాదీ పేసర్. అయితే బుమ్రా కంటే సిరాజ్ చాలా టాలెంటెడ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా...

PREV
110
మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా కంటే చాలా టాలెంటెడ్... ఆశీష్ నెహ్రా సంచలన కామెంట్...

‘సిరాజ్, బుమ్రా కంటే చాలా టాలెంటెడ్ బౌలర్. నా ఉద్దేశంలో బుమ్రా చాలా ఓవర్ రెటెడ్ బౌలర్. కొన్నేళ్ల క్రితం సిరాజ్ ఇండియా ఏకి ఆడేవాడు. ప్రతీ మ్యాచ్‌లో 5,6 వికెట్లు తీసి అదరగొట్టేవాడు...

210

అన్ని ఫార్మాట్లలో సిరాజ్ చాలా చక్కని బౌలర్. అతనిలో ప్రతిభకి కానీ, వేరియేషన్స్ చూపించడంలో కానీ ఎలాంటి లోటు లేదు... స్కిల్ పరంగా చూస్తే బుమ్రా కంటే సిరాజ్ ముందుంటాడు...

310

ఎందుకంటే సిరాజ్ ఓ ప్రత్యేకమైన బౌలర్. అతను ఏ మాత్రం స్పీడ్ లేకుండా స్లో బాల్స్ వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. కొత్త బంతిని సిరాజ్ తిప్పే విధానం అద్భుతం. అయితే సిరాజ్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలి...

410

బాడీతో పాటు బ్రెయిన్‌ను కూడా ఎప్పుడూ పదునుపెడుతూ ఉండాలి. ఈ రెండు చేయగలిగితే సిరాజ్‌ను ఆపడం ఎవ్వరి తరం కాదు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...

510

2017లోనే టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన మహ్మద్ సిరాజ్, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించి, జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే 2020 ఐపీఎల్ నుంచి సిరాజ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది...

610

ఐపీఎల్‌ 2020లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు సిరాజ్. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన సిరాజ్... 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 3 వికెట్లు తీశాడు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఐపీఎల్‌లో బెస్ట్ పర్ఫామెన్స్‌లలో నిలిచాడు.  ఈ పర్ఫామెన్స్‌తోనే సిరాజ్‌కి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కింది...

710

ఆస్ట్రేలియా టూర్‌లో గాయపడిన మహ్మద్ షమీ స్థానంలో రెండో మ్యాచ్‌లో బరిలో దిగిన సిరాజ్... 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మూడో టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ బౌలర్‌గా మారాడు... నాలుగో టెస్టులో అయితే సీనియర్ పేసర్‌గా పేస్ విభాగాన్ని నడిపించాడు.

810

గబ్బా టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... ఆస్ట్రేలియా టూర్‌లో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. 

910

ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్న సిరాజ్... నాలుగు మ్యాచుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా సీజన్2లో 50 డాట్ బాల్స్ వేసిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు. 

1010

ఇప్పటిదాకా నాలుగు మ్యాచుల్లో 15 ఓవర్లు వేసి కేవలం 91 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్, 6 కంటే తక్కువ ఎకానమీతో అదరగొడుతున్నాడు.

click me!

Recommended Stories