చెన్నైలో ఈ చెత్త పిచ్‌లపై మ్యాచులు పెట్టేకంటే... బీసీసీఐపై బెన్ స్టోక్స్, అగార్కర్ ఫైర్...

First Published Apr 24, 2021, 5:34 PM IST

చెన్నైలోని చెపాక్ స్టేడియం... ఎలాంటి బౌలర్లనైనా వణికించే దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్‌కి చెమటలు పట్టించిన పిచ్. ఇక్కడ ఐదు మ్యాచులు ఆడిన ముంబై, ఒక్క మ్యాచ్‌లో కూడా 160 మార్కును అందుకోలేకపోయింది. రెండు మ్యాచుల్లో 140లోపే అవుటైపోయింది. దీంతో ఈ పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టు జరిగింది ఇక్కడే. బ్యాటింగ్‌కి అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్, దాదాపు మూడు రోజుల పాటు బ్యాటింగ్ చేశారు. అయితే ఆ తర్వాతి టెస్టుకి పిచ్‌లో సమూలమైన మార్పులు చేసింది టీమిండియా...
undefined
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు స్పిన్‌కి అనుకూలిస్తున్న పిచ్‌ను దగ్గరుండి తయారుచేయించింది. రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచులు జరుగుతుంది ఈ పిచ్‌పైనే.
undefined
‘ఐపీఎల్ మ్యాచులు సాగేకొద్దీ ఈ వికెట్ కాస్త మెరుగవుతుందని అనుకుంటున్నా. టీ20 మ్యాచ్ అంటే కనీసం 160, 170 స్కోరు ఉండాలి. అంతేకానీ 130, 140 స్కోరు చేసే వికెట్లు టీ20లకు ఏ మాత్రం పనికి రావు...’ అంటూ ట్వీట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్...
undefined
‘కరోనా కారణంగా ఐపీఎల్ షెడ్యూల్‌ చాలా క్లిష్టంగా మారింది. చెన్నైలో వరుసగా మ్యాచులు జరుగుతున్నాయి. ఈ కారణంగా గ్రౌండ్‌మెన్‌కి పిచ్‌ మార్చడానికి కూడా సమయం దొరకడం లేదు... అదీకాక అక్కడి వాతావరణ పరిస్థితులు కూడా పిచ్‌లో మార్పులకు అనుకూలించడం లేదు...
undefined
మొదటి మ్యాచ్‌లో ముంబై 159 పరుగులు చేయగలిగింది. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 131 పరుగులే చేయగలిగింది. అంటే రోజురోజుకీ పిచ్ ఎంత అధ్వాన్నంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పిచ్‌లు టీ20లకు పనికిరావు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్.
undefined
చెన్నైతో పోలిస్తే హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన ప్రతీ మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురిసింది...
undefined
చెన్నైలోని చెత్త పిచ్‌లపై మ్యాచులు నిర్వహించడం కంటే, హైదరాబాద్‌లో మ్యాచులు నిర్వహించొచ్చు కదా అని టాక్ వినిపిస్తోంది. చెన్నైలో జరుగుతున్న లో స్కోరింగ్ గేమ్‌లు ఆడేవారిని ఆయాసాన్ని, చూసేవారికి నీరసాన్ని తెప్పిస్తుండడమే దీనికి ప్రధాన కారణం...
undefined
click me!