సిరాజ్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే... ఇంటికి వెళ్లేందుకు బీసీసీఐ ఆఫర్ ఇచ్చినా...

First Published Nov 22, 2020, 11:09 AM IST

హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరజ్ తన డెడికేషన్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆసీస్ టూర్‌కి ఎంపికైన సిరాజ్... ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే అదృష్టంతో పాటే దురదృష్టం కూడా వెంటే వచ్చినట్టుగా తనకి వచ్చిన అద్భుత అవకాశాన్ని వినియోగించుకునేందుకు నెట్స్‌లో శ్రమిస్తున్న సిరాజ్‌ను తండ్రి మరణవార్త రూపంలో అనుకోని షాక్ తగిలింది...

ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్... తండ్రి మహ్మద్ గౌస్‌ను చివరి చూపు కూడా చూసుకోలేకపోయాడు...
undefined
సిరాజ్‌‌కి అండగా నిలవాలని ప్రయత్నించిన బీసీసీఐ, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వదేశానికి పంపడానికి సిద్ధమైంది... అయితే బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు సిరాజ్.
undefined
తన కెరీర్‌కి అండగా నిలిచిన తండ్రి కోరిక తీర్చేందుకు జట్టుతో కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఇంతటి విషాదంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని క్రికెట్‌పట్ల తన డెడికేషన్ ఎలాంటిదో చూపించాడు సిరాజ్.
undefined
‘సిరాజ్ తండ్రి మరణవార్త విని అందరం షాక్ అయ్యాం. ఈ కష్ట సమయంలో కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు సిరాజ్‌ను ఇంటికి పంపేందుకు అంగీకరిస్తున్నట్టు అతనికి తెలిపాం. కానీ సిరాజ్ జట్టుతో కొనసాగేందుకే మొగ్గుచూపాడు... అతని గుండె నిబ్బరానికి, అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ కార్యదర్శి జై షా.
undefined
బీసీసీఐ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా సిరాజ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చశాడు. ‘ఈ బాధను అధిగమించేందుకు అతనికిప్పుడు శక్తి కావాలి. ఆసీస్ పర్యటనలో సిరాజ్ అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నా. అతని మనోధైర్యానికి నా అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు గంగూలీ.
undefined
టీమిండియా తరుపున ఒక వన్డే మ్యాచ్‌తో పాటు మూడు టీ20 మ్యాచులు ఆడిన సిరాజ్, రంజీ ట్రోఫీతో పాటు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆసీస్ టూర్‌కి ఎంపికయ్యాడు. ఆసీస్ టూర్‌లో అతను టెస్టుల్లో ఆరంగ్రేటం చేయబోతున్నాడు.
undefined
ఆటో డ్రైవర్ అయిన మహమ్మద్ గౌస్... కొడుకును కష్టపడి క్రికెటర్‌ని చేశాడు. తన కొడుకు టీమిండియాకు ఆడాలనేది సిరాజ్ తండ్రి కల. అందుకే భారత జట్టుతో కొనసాగేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు సిరాజ్.
undefined
కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న 53 ఏళ్ల మహమ్మద్ గౌస్... శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
undefined
‘నాన్న లేడనే విషయాన్ని అంగీకరించలేకపోతున్నా. చాలా బాధగా ఉంది. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నా... నా జీవితంలో నాకు ఎప్పుడూ సపోర్టుగా నిలిచాడు నాన్న. నా కొడుకు దేశం గర్వించేలా చేయాలని నాన్న ఎప్పుడూ అనేవారు. దాని కోసం నా శయశక్తులా ప్రయత్నిస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు మహమ్మద్ సిరాజ్.
undefined
ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు సిరాజ్. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన సిరాజ్... 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 3 వికెట్లు తీశాడు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఐపీఎల్‌లో బెస్ట్ పర్ఫామెన్స్‌లలో నిలిచాడు.
undefined
ఈ ప్రదర్శన తర్వాత ప్రతీ న్యూస్ పేపర్‌లోనూ సిరాజ్ ఫోటోలే వచ్చాయి. ఈ మ్యాచ్‌కి ముందే కాస్త కోలుకున్న గౌస్... ‘హైదరాబాద్‌లోని ప్రతీ న్యూస్ పేపర్‌లోనూ నీ ఫోటోనే ఉంది బేటా’ అంటూ సంతోషంగా చెప్పాడని సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
undefined
click me!