వాళ్ల దగ్గర బాగా డబ్బుంది, అందుకే బాగా ఆడుతున్నారు... టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్..

Published : Sep 03, 2022, 09:55 PM IST

టీమిండియాపై అక్కసు వెల్లకట్టడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటారు పాక్ మాజీ క్రికెటర్లు. భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఏదో ఒకటి పొగుడుతూ యూట్యూబ్ వీడియోలు చేసి వ్యూస్ పెంచుకోవాలని కొందరు మాజీ క్రికెటర్లు భావిస్తుంటే... మరికొందరు మాత్రం భారత జట్టును, భారత క్రికెటర్లను ట్రోల్ చేస్తూ వార్తల్లో నిలవాలని చూస్తున్నారు... ఈ లిస్టులో టాప్‌లో ఉంటాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్... 

PREV
17
వాళ్ల దగ్గర బాగా డబ్బుంది, అందుకే బాగా ఆడుతున్నారు... టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్..

రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, అతని బాడీ లాంగ్వేజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్, ఇప్పుడు ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.. 

27
Shoaib Malik -Mohammed Hafeez

‘నాకు ఓ విషయం బాగా తెలుసు... సోసైటీలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారిపై జనాలు ప్రేమ, ఇష్టం ఎక్కువ చూపుతారు. వారికి ఎక్కువ ముద్దులు దక్కుతాయి, ఎక్కువ మమకారం కూడా దక్కుతుంది. ఇప్పుడు భారత జట్టు పరిస్థితి కూడా అదే...

37

భారత్ దగ్గర చాలా డబ్బు ఉంది. ఐపీఎల్ వల్ల వారికి బోలెడు డబ్బు వస్తోంది. అందుకే టీమిండియా ఏ ద్వైపాక్షిక సిరీస్ ఆడినా ప్రపంచవ్యాప్తంగా జనాలు చూస్తారు. అందుకే వాళ్లతో ఆడాలని అందరూ అనుకుంటారు..

47

టీమిండియాతో ఆడితే ఆ జట్టు జాక్‌పాక్ కొట్టినట్టే. ఆ సిరీస్‌కి స్పాన్సర్లు ఎగబడతారు...ఎవ్వరికైనా కావాల్సింది ఆదాయం, లాభమే కదా.. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్...

57

మహ్మద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యలతో అంగీకరించని టీవీ యాంకర్... ‘టీమిండియాపై మమకారం వాళ్ల దగ్గర ఉన్న డబ్బు వల్లేనా.. వాళ్ల ఆటతీరు వల్ల కాదా... భారత జట్టు బాగా ఆడడం వల్ల ఎక్కువ డబ్బులు రావడం లేదా..’ అంటూ ప్రశ్నించాడు. దానికి హఫీజ్... ‘ఆట అనేది డబ్బు తర్వాతి విషయం...’ అంటూ కామెంట్ చేశాడు.

67

గత 3 ఏళ్లలో భారత జట్టు... సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో టీ20 సిరీస్‌లు గెలిచిన ఒకే ఒక్క జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే హఫీజ్‌కి మాత్రం బీసీసీఐ దగ్గర ఉన్న డబ్బు మాత్రమే కనిపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

77

భారత జట్టు వాళ్ల పర్ఫామెన్స్‌ల ద్వారా బెస్ట్ టీమ్‌గా నిరూపించుకుంది. పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌కి వాళ్ల టీమ్ ఎంత స్ట్రాంగ్ అనేది బాగా తెలుసు. కేవలం వార్తల్లో నిలవాలని ఇలాంటి కామెంట్లు చేయకూడదు...  అంటూ కొందరు పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా హపీజ్‌ని ట్రోల్ చేస్తుండడం విశేషం...

click me!

Recommended Stories