టీమిండియాకి భారీ షాక్... టీ20 వరల్డ్ కప్‌ 2022కి దూరమైన స్టార్ ఆల్‌రౌండర్...

Published : Sep 03, 2022, 07:40 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ పరాభవం నుంచి బయటపడడానికి టీమిండియాకి చాలా సమయమే పట్టింది. ఆ పరాభవం తర్వాత మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, వరుస సిరీస్ విజయాలతో జైత్ర యాత్ర కొనసాగిస్తున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన రవీంద్ర జడేజా... టీ20 వరల్డ్ కప్ 2022కి దూరమయ్యాడు...

PREV
17
టీమిండియాకి భారీ షాక్... టీ20 వరల్డ్ కప్‌ 2022కి దూరమైన స్టార్ ఆల్‌రౌండర్...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులు ఇచ్చిన రవీంద్ర జడేజా, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి... ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు...
హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి రాని రవీంద్ర జడేజా, 4 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. 

27
Image credit: PTI

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా... మోకాలి గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. అయితే జడ్డూ అయిన గాయం ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని సమాచారం...

37
Ravindra Jadeja

రవీంద్ర జడేజా త్వరలో తన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నాడు. ఆ తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని అంచనా. అంటే వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి రవీంద్ర జడేజా అందుబాటులో ఉండడు...

47
Ravindra Jadeja

2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో రవీంద్ర జడేజా రెండు సార్లు గాయపడ్డాడు. వన్డే సిరీస్‌లో గాయపడిన జడేజా, రెండో టెస్టుకి అందుబాటులోకి వచ్చాడు. అయితే మూడో టెస్టులో మళ్లీ జడేజా, చేతికి గాయమైంది. ఈ గాయంతో క్రికెట్‌కి మూడు నెలల పాటు దూరమయ్యాడు రవీంద్ర జడేజా...

57

గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని మూడు నెలల తర్వాత టీమిండియాలోకి వచ్చిన రవీంద్ర జడేజా, గత ఏడాది కాలంలో మరో నాలుగు సార్లు గాయాలతో టీమ్‌కి దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు ఆడిన జడేజా, గాయంతో రెండో టెస్టు ఆడలేదు...

67

ఐపీఎల్ 2022ని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ప్రారంభించిన రవీంద్ర జడేజా, సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌కే గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి జడేజా గాయపడడం.. అతని అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది...

77
jadeja

బ్యాటుతో భారీ సిక్సర్లు బాదడమే కాకుండా, బాల్‌తో మ్యాజిక్ చేయగల రవీంద్ర జడేజా, ఫీల్డింగ్‌లో మెరుపు క్యాచులు అందుకోగలడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ని మలుపు తిప్పగల జడేజాలాంటి ప్లేయర్ దూరం కావడం టీమిండియాకి పెద్ద ఎదురుదెబ్బే...

click me!

Recommended Stories