విరాట్ కోహ్లీ ఇలా ఆడడం వల్లే ఆర్‌సీబీ ఓడిపోతోంది! అతను ఎప్పటికీ సూర్య, రోహిత్‌‌లా ఆడలేడు...

First Published Sep 3, 2022, 8:28 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. రెండు మ్యాచుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, 94 సగటుతో పరుగులు చేశాడు. అయితే విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు మాత్రం 120.51గా ఉంది. దీనిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్...

Image credit: Getty

‘విరాట్ కోహ్లీ ఎప్పటికే సూర్యకుమార్ యాదవ్ కానీ, రోహిత్ శర్మ కానీ కాలేదు. విరాట్ కోహ్లీ ఇలా ఆడడం వల్లే ఆర్‌సీబీ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ఎందుకంటే అతనికి ఇన్నింగ్స్ స్పీడ్ పెంచడం రాదు...

ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ని చూడండి. అతను కూడా కొన్ని డాట్ బాల్స్ ఆడతాడు. అయితే ఆ తర్వాత కొన్ని సిక్సర్లు కొట్టి లెక్క సరిచేస్తాడు. విరాట్ కోహ్లీకి ఇది చేతకాదు. కాబట్టి హంగ్ కాంగ్‌పై అతను ఎలా ఆడాడనేదాని గురించి చర్చ అనవసరం...

Virat Kohli

అది విరాట్ కోహ్లీ సహజమైన ఆట. అతను ఎక్కువగా 30-35 పరుగులు దాటిన తర్వాత భారీ షాట్లు ఆడతాడు. నేను ఐపీఎల్ చూస్తాను, భారత జట్టు ఆడే మ్యాచులు కూడా చూస్తాను. రోహిత్ శర్మ పవర్ ప్లేని బాగా వాడుకుంటాడు...

Virat Kohli

రోహిత్ క్రీజులో ఉంటే ఎక్కువ సేపు సైలెంట్‌గా ఉండడు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూనే ఉంటాడు.. విరాట్ కోహ్లీకి ఇది రాదు. ఎందుకంటే అతను టీ20 ప్లేయర్ కాదు...

Virat Kohli

విరాట్ కోహ్లీ యావరేజ్ బాగుంది కానీ అతని స్ట్రైయిక్ రేటు సంగతేంటి? విరాట్ కోహ్లీని స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్, బాబర్ ఆజమ్‌లతో పోలుస్తాం. ఎందుకంటే వీరిలో ఎవ్వరూ కూడా టీ20ల్లో మ్యాచ్ విన్నర్లు కారు...

అయితే వన్డేల్లో మాత్రం వీళ్లెవ్వరూ విరాట్ కోహ్లీ దగ్గరికి కూడా రాలేదు. వన్డేలకు కావాల్సిన స్కిల్స్ విరాట్‌లో పుష్కలంగా ఉన్నాయి. వన్డేల్లో మొదటి 10 ఓవర్లు ఓ లెక్క, ఆ తర్వాత 11 నుంచి 40 ఓవర్లు మరో లెక్క... చివరి 10 ఓవర్ల లెక్క వేరు... ఈ మూడు లెవెల్స్‌లో ఎలా ఆడాలో విరాట్‌కి బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్...

click me!