ఆపరేషన్ ఆకర్ష్ లో భాగమేనా...? అజారుద్దిన్ గెలుపుకు కేటీఆర్ వ్యూహం

First Published Sep 27, 2019, 6:29 PM IST

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దిన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. అయితే ఆయన గెలుపుకు మంత్రి కేటీఆర్ మద్దతే  కారణమన్న ప్రచారం అప్పుడే  క్రీడావర్గాల్లో మొదలయ్యింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే కేటీఆర్ అజార్ ను గెలిపించినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.  

దేశవ్యాప్తంగా బిసిసిఐ అనుబంధ సంఘాలన్నిట్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రా, తమిళనాడు వంటి క్రికెట్ సంఘాల్లో ఎన్నికలు లేకుండానే పదవులన్నీ ఏకగ్రీమయ్యాయి. కానీ మిగతాచోట్ల మాత్రం ఈ ఎన్నికలు రాజకీయ రంగును పులుముకున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల చక్రం తిప్పుతోందని మాజీ హెచ్‌సీఏ అధ్యక్షులు వివేక్ చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం. ఈ ఆరోపణల్లో నిజమెంతో చెప్పలేం కానీ తాజాగా ప్రకటించిన హెచ్‌సీఎ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మాత్రం కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.
undefined
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, లోదా కమిటీ సిపార్సుల కారణంగా 2007 హెచ్‌సిఎ ఎన్నికల్లో అజారుద్దిన్ పోటీనుండి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి ఎన్నికల అధికారి అతన్ని అనర్హుడిగా ప్రకటించారు. ఆ సమయంలో అతడికి ఎలాంటి సపోర్ట్ లేదు. సొంతపార్టీలోని కొందరు నాయకులే అజారుద్దిన్ కు వ్యతిరేకంగా పనిచేసినట్లు ప్రచారం కూడా జరిగింది.
undefined
కాలం గిర్రున రెండేళ్లు తిరిగింది. మళ్లీ ఈ మాజీ కెప్టెన్ హెచ్‌సిఎ ఎన్నికల బరిలోకి దిగాడు. కానీ ఈసారి మాత్రం అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురవలేదు. ఏకంగా అతడు అధ్యక్ష పదవినే చేపట్టే స్థాయికి చేరుకున్నాడు. రెండేళ్ల కింద అనర్హతను ఎదుర్కొన్న అతడు తాజాగా అధ్యక్షపీఠాన్ని దక్కించుకోవడం అందరిని కొంత డైలమాలోకి నెట్టింది.
undefined
ఈ సమయంలోనే వివేక్ మాటలు నిజమేనేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. 2007 లో ఎవ్వరి సపోర్ట్ లేకపోవడంతో అజార్ కనీసం పోటీలోనే నిలవలేకపోయాడు. తాజాగా అధికార పార్టీ అండదండలు ముఖ్యంగా మంత్రి కేటీఆర్ మద్దతువల్లే అతడు గెలుపొందినట్లు ప్రచారం మొదలయ్యింది. అంతేకాదు ఈ మద్దతు వెనుక ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం దాగున్నట్లు ప్రజల్లో చర్చ సాగుతోంది.
undefined
కాంగ్రెస్ మాజీ ఎంపి అయిన అజారుద్దిన్ ను టీఆర్ఎస్ లో చేర్చుకోడానికి కేటీఆర్ హెచ్‌సిఏ ఎన్నికలను పావుగా వాడుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో మద్దతిచ్చి గెలిపిస్తామని... అయితే గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో చేరాలంటూ అజారుద్దిన్ కు కేటీఆర్ సూచించారట. దీని ప్రకారమే మరో రెండురోజుల్లో అతడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
undefined
ఈ క్రమంలోనే కేటీఆర్-అజారుద్దిన్ ల మధ్య మరో ఒప్పందం కూడా జరిగినట్లు వివేక్ ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఖాళీగా వున్న తన సోదరి కవితను క్రికెట్ కు సంబంధించిన రాజకీయాల్లోకి పంపించాలని కేటీఆర్ భావిస్తున్నారట. అందువల్లే ప్రస్తుతం అజారుద్దిన్ ను అధ్యక్షుడిగా చేసి తర్వాతి టర్మ్ లో కవితను ఆ పదవిలో కూర్చోబెట్టాలన్నది వ్యూహమట. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి చెందిన అజారుద్దిన్ కు కేటీఆర్ మద్దతిస్తున్నాడని వివేక్ ఆరోపించారు.
undefined
తాజా హెచ్‌సిఎ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు వివేక్ కూడా పోటీకి ఆసక్తి చూపించాడు. కానీ అతడి నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. టీఆర్ఎస్ పార్టీ కుట్రల వల్లే తన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు వివేక్ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా గతంలో అజారుద్దిన్ నామినేషన్ తిరస్కరణకు గురయితే వివేక్ అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు వివేక్ నామినేషన్ తిరస్కరణ గురయితే అజారుద్దిన్ అధ్యక్షుడయ్యాడు.
undefined
కొద్దిసేపటి క్రితమే హెచ్‌సీఏ ఎన్నికల పలితాలను ప్రకటించారు.  ఇందులో అధ్యక్ష పదవికి పోటీ చేసిన మాజీ టీమిండియా కెప్టెన్ అజారుద్దిన్ విజయకేతనం ఎగరేశాడు.  ఇవాళ(శుక్రవారం) జరిగిన ఎన్నికల్లో మొత్తం 223 ఓట్లు పోలవ్వగా అజార్ కు 147 ఓట్లు వచ్చాయి. ప్రకాశ్‌ జైన్‌కు 73, దిలీప్‌ కుమార్‌కు 3 ఓట్లు పడ్డాయి.  దీంతో దాదాపు సగానికి పైగా ఓట్లను దక్కించుకున్న అజారుద్దిన్ 74 ఓట్ల తేడాతొ విజయకేతనం ఎగరేశాడు.
undefined
click me!