విధ్వంసానికి పరాకాష్ట... యువీని హీరో చేసిన ఇన్నింగ్స్ కు ఏదంటే

First Published Sep 19, 2019, 9:10 PM IST

టీమిండియా ఆల్ రౌండర్  యువరాజ్ సింగ్ ఆరు  బంతుల్లో ఆరు సిక్సర్ల ఇన్నింగ్స్ మీకు గుర్తుండే వుంటుంది. ఆ సూపర్ ఇన్నింగ్స్కు  నేటితో  12ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటికీ అభిమానులు ఆ ఇన్నింగ్స్ ను గుర్తుచేసుకుంటున్నారంటే దానికున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధమవుతుంది.  

భారత క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్యాట్ నుండి జాలువారాయి. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్...ఈ రెండు మెగా టోర్నీలలోనూ అతడి ఆట అత్యద్భుతం. ఈ రెండు ప్రపంచ కప్ లను టీమిండియా అందించింది ఘనత అతడిదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా అతడు టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ లోనే అత్యున్నత ట్రోఫీలను అందించినా రాని క్రేజ్ కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్ ద్వారా వచ్చింది. అదే ''ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల'' సూపర్ షో.
undefined
2007 లో ఐసిసి మొదటిసారిగా టీ20 ప్రపంచ కప్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచ కప్ ను భారత్ కు అందించిన ఘనత మాత్రం యువరాజ్ దే. ఫార్మాట్ ఏదైనా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటం యువీ బ్యాటింగ్ స్టైల్. ఇది సరిగ్గా టీ20 పార్మాట్ కు సరిపోతుంది. ఇకేముంది ఈ ప్రపంచ కప్ లో యువీ తన స్టైల్లోనే చెలరేగిపోయి ప్రత్యర్థులను చిత్తు చేశాడు.
undefined
ముఖ్యంగా ఈ టోర్నీలో ఇంగ్లాండ్ పై అతడు ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్ ను అభిమానులు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. ఇంగ్లీష్ బౌలర్లందరికీ చుక్కలు చూపించిన యువీ స్టువర్ట్ బ్రాడ్ ను ఏకంగా ఏడిపించాడు. అతడు వేసిన ఓ ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాది తుఫాను సృష్టించాడు. ఇలా కేవలం 12 బంతుల్లోనే అర్థశతకాన్ని బాది వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.
undefined
ఆకాశమే హద్దుగా చెలరేగిన యువీ సాధించిన ఈ రికార్డు 12 ఏళ్లుగా పదిలంగా వుంది. సరిగ్గా ఇదే రోజు అంటే 2007 సెప్టెంబర్ 19నే అతడు ఇంగ్లీష్ బౌలర్లను ఉతికి ఆరేసింది. ఇన్నేళ్లు గడిచినా ఈ రికార్డును బద్దలుగొట్టడం ఏ ఆటగాడికీ సాధ్యం కాలేదు. ఇప్పటికీ ఈ ఇన్నింగ్స్ ను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారంటే దానికున్న పాపులారిటీ ఆర్థమవుతుంది.
undefined
ఐపిఎల్ రాకతో క్రికెట్ అంటేనే భారీ హిట్టర్ల గేమ్ గా మారిపోయింది. అలాంటిది ఈ తరం క్రికెట్ లోనూ యువీ నెలకొల్పిన రికార్డును కనీసం ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు అతడి పేరిటే వుంది.
undefined
యువరాజ్ విధ్వంసం సృష్టించడంతో భారత్ 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 200 పరుగులకే చాపచుట్టేసింది. ఇలా భారత్ 18 పరుగులతో గెలిచింది. ఇలా కేవలం ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు మొత్తం టోర్నీలో తన విధ్వంసాన్ని కొనసాగించిన యువీ భారత్ కు మొదటి టీ20 వరల్డ్ కప్ టోఫీని అందించాడు.
undefined
ఇక 2011 వరల్డ్ కప్ లో కూడా యువీ ఆల్ రౌండ్ ప్రదర్శన కొనసాగింది. అతడు ఈ మెగా టోర్నీలో 362 పరుగులు బాది 15 వికెట్లతో రాణించాడు. దీంతో భారత్ రెండో ప్రపంచ కప్ ను అందుకోగా యువీ మ్యాన్ ఆప్ ది సీరిస్ గా నిలిచాడు. ఇలా టీమిండియాకు రెండు మెగా ట్రోఫీలు అందించిన యువరాజ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరయ్యాడు.
undefined
click me!