అందుకే ఆమెను ‘లేడీ సచిన్’ అనేది... ధోనీ వంటి వాళ్ల వల్లే కానిది, మిథాలీ రాజ్ చేసి చూపించింది...

Published : Jun 08, 2022, 02:51 PM ISTUpdated : Jun 08, 2022, 02:56 PM IST

భారత పురుషుల క్రికెట్‌కి క్రేజ్ తీసుకొచ్చింది సచిన్ టెండూల్కర్ అయితే, మహిళల క్రికెట్ విషయంలో మాత్రం ఆ క్రెడిట్ మిథాలీ రాజ్‌కే దక్కుతుంది. భారత మహిళా జట్టు అనేది ఒకటుందని కూడా తెలియని రోజుల్లో మిథాలీ రాజ్ ఎంట్రీ... వుమెన్స్ క్రికెట్‌కి కాస్తో కూస్తో ఆదరణ తీసుకోరాగలిగింది...

PREV
18
అందుకే ఆమెను ‘లేడీ సచిన్’ అనేది... ధోనీ వంటి వాళ్ల వల్లే కానిది, మిథాలీ రాజ్ చేసి చూపించింది...

మిథాలీ రాజ్‌ని అందరూ ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు. ఎందుకంటే పురుషుల క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాడో, వుమెన్స్ క్రికెట్‌లో మిథాలీ పేరిట కూడా అన్ని రికార్డులు ఉంటాయి...

28

1999వ సంవత్సరంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మిథా రాజ్, 16 ఏళ్ల 205 రోజుల వయసులో వన్డేల్లో సెంచరీ చేసి... అతి పిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌లో ఐర్లాండ్ వుమెన్ క్రికెటర్ అమీ హంటర్, 16 ఏళ్లకు సెంచరీ చేసి మిథాలీ రికార్డును 22 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసింది...

38

టెస్టుల్లో అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ కూడా మిథాలీ రాజ్. 19 ఏళ్ల 254 రోజుల వయసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదేసింది మిథాలీ రాజ్...

48
Mithali Raj

వన్డేల్లో 6 వేలు, 7 వేల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా నిలిచిన మిథాలీ రాజ్, 7805 పరుగులతో వుమెన్స్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది...

58
Mithali Raj

వన్డేల్లో 5 సార్లు 90+ స్కోర్లు చేసిన మిథాలీ రాజ్, వన్డేల్లో 155 మ్యాచులకు కెప్టెన్‌గా చేసి రికార్డులు క్రియేట్ చేసింది...  ఆరు వన్డే ప్రపంచకప్ లలో ఆడిన  తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది మిథాలీ. పురుషుల క్రికెట్ లో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పాకిస్థాన్ దిగ్గజం జావేద్ మియాందాద్ పేరిట ఉంది.  సచిన్ తన కెరీర్ లో 1992, 1996, 1999, 2003, 2007, 2011  వన్డే ప్రపంచకప్ లలో భారత్ తరఫున ఆడాడు.  మిథాలీ రాజ్ 2000, 2005, 2009, 2013, 2017, 2022 వన్డే వరల్డ్ కప్ లలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించింది. 

68

వన్డేల్లో వరుసగా 7 మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన మిథాలీ రాజ్,  వన్డే కెరీర్‌లో 71 హాఫ్ సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా టాప్‌లో నిలిచింది... 

78

అన్నింటికీ మించి 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మిథాలీ రాజ్ 22 ఏళ్ల 11 నెలల పాటు వన్డేల్లో కొనసాగి సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్‌ని కొనసాగించింది. మిథాలీ రాజ్ ఎంట్రీ తర్వాత టీమిండియాలోకి వచ్చిన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఎమ్మెస్ ధోనీ వంటి క్రికెటర్లు అందరూ రిటైర్మెంట్ ప్రకటించినా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగింది ఈ లెజెండరీ క్రికెటర్...

88
Mithali Raj

పురుష క్రికెటర్లే 34 ఏళ్లు దాటగానే క్రికెట్ నుంచి తప్పుకుంటున్న సమయంలో 39 ఏళ్ల వయసులో పెళ్లి కూడా చేసుకోకుండా క్రికెట్‌కే తన జీవితాన్ని అంకితం చేసింది మిథాలీ రాజ్...

click me!

Recommended Stories