టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఘోర పరాభవం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడేందుకు సిద్దమవుతోంది భారత జట్టు. అక్టోబర్‌లో ఆస్ట్రేలయాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు ఎలా ఉండబోతోంది...
ప్రస్తుత ఫామ్‌ని పక్కనబెట్టినా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తారు. ఈ ఇద్దరినీ కాకుండా రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ వంటి యంగ్ ఓపెనర్లను ప్రయత్నించే సాహసం ఈసారి టీమిండియా చేయకపోవచ్చు...
210
తనకి అచొచ్చని మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కి వస్తారు. నాలుగో స్థానం విషయంలో శ్రేయాస్ అయ్యర్, యాదవ్‌తో పోటీపడుతున్నా నిలకడలేమి కారణంగా అతనికి తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే మారింది...
310
ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌కి వస్తాడు. గత రెండేళ్లుగా రిషబ్ పంత్ ఆడుతున్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, అతను లేకుండా భారత జట్టు టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ఆడడం రిస్కే అవుతుంది...
410
KL Rahul-Hardik Pandya
ఆ తర్వాత ఆల్‌రౌండర్లుగా, మ్యాచ్ ఫినిషర్లుగా హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉండనే ఉంటారు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు లేకపోతే ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ఆడకుండా ఎవ్వరూ ఆపలేరు...
510
పేస్ బౌలర్లుగా మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ స్థానాలు పదిలం చేసుకున్నట్టే. హర్షల్ పటేల్‌కి బదులుగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భువనేశ్వర్ కుమర్‌ని ఆడించి చేతులు కాల్చుకుంది టీమిండియా. ఈ సారి అలాంటి మిస్టేక్ చేయకపోవచ్చు...
610
ఆస్ట్రేలియాలో స్పిన్‌కి పిచ్ పెద్దగా సహకరించవు. కాబట్టి భారత ప్రధాన స్పిన్నర్‌గా యజ్వేంద్ర చాహాల్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు. అలాగే స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా కూడా తుదిజట్టులో ఉంటాడు... కుల్దీప్ యాదవ్, రవి భిష్ణోయ్ వంటి స్పిన్నర్లు వరల్డ్ కప్‌కి ఎంపికైనా తుదిజట్టులోకి రావడం కష్టమే...
710
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు దక్కొచ్చు. అయితే తుదిజట్టులో దినేశ్ కార్తీక్ చోటు దక్కించుకుని, ఎన్ని మ్యాచులు ఆడతాడనేది అనుమానమే. ఎందుకంటే దినేశ్ కార్తీక్‌ని తుదిజట్టులోకి తేవాలంటే హార్ధిక్ పాండ్యా, జడేజా లేదా రిషబ్ పంత్‌లలో ఎవరో ఒకరిని తుదిజట్టు నుంచి తప్పించాల్సి ఉంటుంది...
810
ఆల్‌రౌండర్లను టీమ్ నుంచి తప్పిస్తే బౌలింగ్ ఆప్షన్లు బాగా తగ్గిపోతాయి. కాబట్టి ఒకవేళ హార్ధిక్ పాండ్యా ఫిట్‌గా లేకపోతే శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్ వంటి ఆల్‌రౌండర్లు టీమ్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది...
910
Image credit: PTI
సీనియర్లను కాదని ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యంగ్ పేసర్లు అదిరిపోయే పర్ఫామెన్స్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కించుకున్నా, వాళ్లు తుదిజట్టులోకి వచ్చే మ్యాచులు ఆడే అవకాశాలు చాలా తక్కువే..
1010
మొత్తానికి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే భారత జట్టు ఇలా ఉంటుంది: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహాల్, జస్ప్రిత్ బుమ్రా