మిథాలీ రాజ్ రిటైర్మెంట్... టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!

Published : Jun 08, 2022, 04:36 PM IST

ఇన్నాళ్లు జట్టులో సీనియర్‌గా ఉంటూ, భారత జట్టును వన్డే, టెస్టు ఫార్మాట్లలో నడిపించింది మిథాలీ రాజ్. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు టీమిండియా వుమెన్స్ టీమ్ తర్వాతి కెప్టెన్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది... ఈ రేసులో అందరికంటే ముందంజలో ఉంది స్మృతి మంధాన...

PREV
19
మిథాలీ రాజ్ రిటైర్మెంట్... టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!

భారత మహిళా జట్టులోకి ఓ సంచలనంలా ఎంట్రీ ఇచ్చింది స్మృతి మంధాన. అందంతో యూత్‌లో ఫాలోయింగ్ తెచ్చుకుని, అంతకుమించిన ఆటతో తన క్రేజ్‌ పెంచుకుంది... 

29

టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా మారిన స్మృతి మంధాన, టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్... వన్డేల్లో కెప్టెన్సీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నా,ఆమె వయసు ఇప్పటికే 33 ఏళ్లు...

39

ఈ వయసులో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం చిన్న విషయం కాదు. అలాగే హర్మన్‌ప్రీత్ కౌర్ కొన్నాళ్లుగా గాయాలతో బాధపడుతూ సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది. దీంతో సెన్సేషనల్ స్టార్ స్మృతి మంధానకి కెప్టెన్సీ దక్కవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు...

49

కొన్నాళ్ల క్రిందట స్మృతి మంధాన త్వరలోనే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటుందని భారత మహిళా జట్టు హెడ్ కోచ్ రమేశ్ పవార్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.. 

59

సౌతాఫ్రికా టూర్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న స్మృతి మంధాన, ఆస్ట్రేలియా టూర్‌లో బ్యాటింగ్ భారాన్నంతా ఒంటిచేత్తో మోసింది...  రెండో వన్డే మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన 25 ఏళ్ల స్మృతి మంధాన, పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో 127 పరుగులు చేసి భారత జట్టుకి భారీ స్కోరు అందించింది...
 

69

టీ20ల్లోనూ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన స్మృతి మంధాన, ఆఖరి టీ20 మ్యాచ్‌లో 52 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసింది... మొత్తంగా ఈ టూర్‌లో 340+ పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచింది...

79

‘స్మృతి మంధానలో ఓ లీడర్ ఉంది. ఆమెను జట్టును నడిపించగల సత్తా ఉన్న ప్లేయర్‌గా చూస్తున్నాం. జట్టులోని మిగిలిన యంగ్ ప్లేయర్లను ఆమె తన ఆటతో ఎంతగానో ఇన్‌స్పైర్ చేస్తోంది...

89

కీలక మ్యాచుల్లో ఆమె ఆటతీరు అద్భుతం. పింక్ బాల్ టెస్టుల్లో ఆమె చేసిన సెంచరీ చాలా గొప్పది. తను ఓ డిఫెరెంట్ ప్లేయర్. వరల్డ్‌లో అనేక లీగుల్లో ఆడుతూ చాలా అనుభవం సంపాదిస్తోంది...

99

టీమిండియాకి ఓ విలువైన ప్లేయర్‌గా మారింది స్మృతి మంధాన. వరల్డ్‌కప్ గెలవాలంటే తనలాంటి ప్లేయర్లు కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా వుమెన్స్ టీమ్ హెడ్ కోచ్ రమేశ్ పవార్...

click me!

Recommended Stories