కోచ్‌తో గొడవలు, హర్మన్‌ప్రీత్‌తో విభేదాలు... మిథాలీ కెరీర్‌ని కుదిపేసిన సంఘటనలు ఇవే...

Published : Jun 08, 2022, 03:13 PM ISTUpdated : Jun 08, 2022, 03:48 PM IST

భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీ రాజ్... 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ని వీడ్కోలు పలికింది. 1999లో 16 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మిథాలీ, మహిళా క్రికెట్‌లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసింది. అయితే ఈ సుదీర్ఘ కెరీర్‌లో ఆమె కెరీర్‌లో కొన్ని వివాదలు కూడా చుట్టుముట్టాయి..

PREV
16
కోచ్‌తో గొడవలు, హర్మన్‌ప్రీత్‌తో విభేదాలు... మిథాలీ కెరీర్‌ని కుదిపేసిన సంఘటనలు ఇవే...

2018 టీ20 వరల్డ్‌కప్ సమయంలో భారత జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్. ఆ సమయంలో భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌కి భారత టీ20 జట్టులో చోటు కల్పించకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. 

26

తనను కావాలనే టీ20 జట్టుకి దూరం చేస్తున్నారని హెడ్ కోచ్ రమేశ్ పవార్, సీఓఏ సభ్యురాలు డియానా ఎడ్లుల్జీలపై ఆరోపణలు చేసింది మిథాలీరాజ్. బ్యాటింగ్ ఆర్డర్‌లో తనని కింద ఆడాల్సిందిగా వాళ్లు ఒత్తిడి పెడుతున్నారని ఆరోపించింది మిథాలీ...

36

అయితే రమేశ్ పవార్, మిథాలీపై రివర్స్ ఆరోపణలు చేశాడు. ‘సీనియర్ ప్లేయర్‌గా జట్టు పరిస్థితిని అర్థం చేసుకుని ఆడాల్సిన మిథాలీరాజ్, బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి పంపితే, రిటైర్మెంట్ ప్రకటిస్తానని బెదిరించిందని’ ఆరోపించాడు రమేశ్ పవార్...

46
Mithali Raj

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిథాలీజ్ 50 పరుగులు చేసి ఆదుకుంది. అయితే మిథాలీ ఇన్నింగ్స్‌లో 25 డాట్ బాల్స్ ఉండడంతో ఆమె కేవలం తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు రమేశ్ పవార్...

56

ఈ సంఘటన తర్వాత రమేశ్ పవార్ కాంట్రాక్ట్ గడువు ముగిసి ఆ పదవి నుంచి తప్పుకోవడంతో డబ్ల్యూవీ రామన్, భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత రమేశ్ పవార్‌ను తిరిగి మహిళా టీమ్ హెడ్ కోచ్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

66
Mithali Raj

రమేశ్ పవార్‌తో వివాదం తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది మిథాలీరాజ్. టీ20 కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్, మిథాలీరాజ్ మధ్య కూడా విభేదాలున్నాయని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. స్లోగా ఆడే మిథాలీ, టీ20ల్లో పనికి రాదని హర్మన్‌ప్రీత్ భావించేదని, ఇదే ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమని వార్తలు వచ్చాయి...

click me!

Recommended Stories