22 ఏళ్లయ్యింది, ఇక రిటైర్మెంట్ సమయం వచ్చింది, దాని తర్వాత... మిథాలీరాజ్ కామెంట్...

First Published Apr 25, 2021, 3:52 PM IST

భారత క్రికెట్‌ చరిత్రలో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి సుధీర్ఘమైన క్రికెట్ కెరీర్ ఉన్న క్రికెటర్ మిథాలీరాజ్. వన్డే, టెస్టు టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న మిథాలీరాజ్, 22 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతోంది. 1999లో మొట్టమొదటి మ్యాచ్ ఆడిన మిథాలీరాజ్, తన రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది...

1999, జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన మిథాలీరాజ్, 2002లో మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడింది. తన కెరీర్‌లో మొత్తంగా 214 వన్డేలు, 89 టీ20 మ్యాచులు, 10 టెస్టులు ఆడింది మిథాలీరాజ్...
undefined
1982, డిసెంబర్ 3న జన్మించిన మిథాలీరాజ్... వన్డేల్లో 7 వేల పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచింది. అంతేకాకుండా 55 హాఫ్ సెంచరీలు, 7 సెంచరీలతో మహిళా క్రికెట్‌లో ‘లేడీ సచిన్‌’గా టాప్‌లో కొనసాగుతోంది...
undefined
‘క్రికెట్ కెరీర్ మొదలెట్టి అప్పుడే 22 ఏళ్లు అయిపోయింది. అయితే నా కెరీర్ మొత్తం ఒక్క 2020 ఏడాదితో సమానంగా చెప్పొచ్చు. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, ఇక్కడి దాకా వచ్చాను...
undefined
ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడం వల్లే ఇన్నేళ్లు క్రికెట్‌లో కొనసాగగలుగుతున్నా... ప్రతీ ప్లేయర్‌కి ఫిట్‌నెస్ చాలా అవసరం. అయితే మహిళలు 30 ఏళ్లు దాటిన తర్వాత ఫిట్‌నెస్‌ మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది...
undefined
అయినా నేను బాగా కష్టపడుతున్నా. నా బాడీని కష్టపెడుతున్నా. నా వయసు పెరుగుతోంది. రిటైర్మెంట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందని నాకు తెలుసు...
undefined
2022 వన్డే వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా... ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టూర్‌తో పాటు విండీస్‌తో సిరీస్ ఆడనుంది. 2022 ప్రపంచకప్‌కి ముందు ఈ సిరీస్‌లు చాలా కీలకం కానున్నాయి...
undefined
నాతో పాటు సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కెరీర్ కూడా ముగింపు దశకు వచ్చేసింది. 2022 వన్డే వరల్డ్‌కప్ నాకు చివరి టోర్నీ... ఆ తర్వాత క్రికెట్‌లో కొనసాగకపోవచ్చు...’ అంటూ చెప్పుకొచ్చింది మిథాలీరాజ్.
undefined
click me!