IPL2021: రాజస్థాన్ రాయల్స్‌కి రెండో విజయం... కేకేఆర్‌కి వరుసగా నాలుగో ఓటమి...

First Published Apr 24, 2021, 11:18 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో మ్యాచ్ వన్‌సైడ్‌గా మారి, క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరుత్సాహపర్చింది. కేకేఆర్ విధించిన 134 పరుగుల లక్ష్యాన్ని  18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది రాజస్థాన్ రాయల్స్. రాయల్స్‌కి ఇది ఈ సీజన్‌లో రెండో విజయం కాగా, కేకేఆర్‌కి ఇది వరుసగా నాలుగో పరాజయం..

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న జోస్ బట్లర్, నేటి మ్యాచ్‌లో కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
undefined
ఆ తర్వాత 17 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేసిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, శివమ్ మావి బౌలింగ్‌లో నాగర్‌కోటీ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...
undefined
శివమ్ దూబే, సంజూ శాంసన్ కలిసి మూడో వికెట్‌కి 45 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 18 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత రాహుల్ తెవాటియా 8 బంతుల్లో 5 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్, సంజూ శాంసన్ కలిసి మ్యాచ్‌ను ముగించారు...
undefined
వస్తూనే హిట్టింగ్‌కి దిగి అవుటయ్యే సంజూ శాంసన్, తన స్టైల్‌కి విరుద్ధంగా నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. 40 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్లతో 41 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేశాడు.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి ఇది రెండో విజయం కాగా వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది..
undefined
click me!