సైడ్, సైడ్, సైడ్ ప్లీజ్... ఐపీఎల్ కోసం పక్కకు తప్పుకున్న సిరీస్‌లు, వచ్చే ఏడాదిలో రెండున్నర నెలలు...

Published : Jul 16, 2022, 05:44 PM IST

ఏనుగు వస్తుంటే ఆ దారి వెంట ఉండే ఎలుకలు, కుందేళ్లు, జింకలు పక్కకు తప్పుకుని తీరాల్సిందే. లేదంటే ఏనుగు కాళ్ల కింద చచ్చిపోవాల్సి ఉంటుంది. క్రికెట్‌లో కూడా అలాంటి మదగజం ఒకటుంది. దానిపేరే ఇండియన్ ప్రీమియర్ లీగ్. వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం ఏకంగా రెండున్నర నెలలు కేటాయించింది ఐసీసీ...

PREV
19
సైడ్, సైడ్, సైడ్ ప్లీజ్... ఐపీఎల్ కోసం పక్కకు తప్పుకున్న సిరీస్‌లు, వచ్చే ఏడాదిలో రెండున్నర నెలలు...
Image credit: PTI

10 ఫ్రాంఛైజీల రాకతో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి లీగ్ సైజు పెరిగింది. ఈ ఏడాది 74 మ్యాచులు జరగగా, రాబోయే సీజన్లలో ఈ సంఖ్య 90 వరకూ పెరిగే అవకాశం ఉందని సమాచారం. తాజాగా వచ్చే ఏడాదికి ఐసీసీ విడుదల చేసిన ఎఫ్‌టీపీ (ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్)లో ఐపీఎల్ కోసం రెండున్నర నెలలు కేటాయించడం విశేషం...

29
Image credit: PTI

ఐపీఎల్‌ సమయంలో విదేశీ క్రికెటర్లు కూడా అందుబాటులో ఉండేలా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఏ ద్వైపాక్షిక సిరీస్‌లు లేకుండా షెడ్యూల్ ఖరారు చేయనుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి...

39
Image credit: PTI

‘వచ్చే ఐసీసీ ఎఫ్‌టీపీ క్యాలెండర్‌లో ఐపీఎల్ కోసం రెండున్నర నెలల విండోని కేటాయించబోతోంది. టాప్ ప్లేయర్లు అందరూ ఐపీఎల్ ఆడేందుకు మార్గాలు సుగమం చేయబోతున్నాం... ఇప్పటికే మిగిలిన దేశాల బోర్డులతో కూడా ఈ విషయం గురించి చర్చించాం...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

49

అయితే బీసీసీఐ విధించిన నిషేధం కారణంగా ఐపీఎల్‌లో పాల్గొనలేకపోతున్న పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ విషయంపై ఏ మాత్రం హ్యాపీగా లేదు. ఐపీఎల్ సమయంలో ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబడుతోంది...

59
Image credit: PTI

ఐపీఎల్ కోసం ఏడాదిలో రెండున్నర నెలలు కేటాయిస్తే... అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచుల సంఖ్య తగ్గిపోతుందని, ఐపీఎల్ కారణంగా ప్లేయర్లు అలసిపోతున్నారని, గాయపడుతున్నారని పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా, ఐసీసీ మీటింగ్‌లో మాట్లాడాడు...

69
Virat Kohli

మిగిలిన లీగులు మ్యాచుల సంఖ్యను తగ్గిస్తూ పోతుంటే ఐపీఎల్‌లో మ్యాచుల సంఖ్య పెంచుతూ పోతున్నారని వాపోయాడు... అయితే అతని వాదనకు మిగిలిన బోర్డుల నుంచి ఏ మాత్రం సహకారం లభించలేదు..

79

అయితే శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్... ఇలా టాప్ టీమ్ ప్లేయర్లు అందరూ ఐపీఎల్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ సమయంలో పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ఆడాలనుకుంటే తమ ఫేవరెట్ జింబాబ్వేతో ఆడుకోవచ్చని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
 

89

ఐపీఎల్‌తో పాటు ది హండ్రెడ్, బిగ్‌బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాక్ సూపర్ లీగ్... ఇలా చాలా క్రికెట్ లీగులు జరుగుతున్నా, వేటికీ అధికారికంగా విండోని కేటాయించలేదు ఐసీసీ...

99

దీనికి ప్రధాన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం ఎక్కువ దేశాల క్రికెటర్లు ఆడడానికి ఇష్టపడడమే కాకుండా ఐపీఎల్ ద్వారా ఐసీసీకి కూడా కోట్లలో ఆదాయం సమకూరుతుండడం...

click me!

Recommended Stories