అతడిని బాగా మిస్ అవుతున్నా... ఐపీఎల్‌లో ఆడి ఉంటేనా... పూజారా కామెంట్!

First Published Apr 5, 2021, 11:31 AM IST

టెస్టు జట్టులో టీమిండియాకి వెన్నెముకలాంటి ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా. నిప్పులు చెదిరే బంతులను కూడా టుక్ టుక్ మంటూ డిఫెన్స్ ఆడే పూజారా... సిక్సర్లు బాదడం చాలా చాలా అరుదు. అలాంటి టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ పూజారాను ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 

ఏడేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడబోతున్న ఛతేశ్వర్ పూజారా, తన సహచర టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారిని బాగా మిస్ అవుతున్నాడట. అతను కూడా ఉండి ఉంటే, చాలా బాగుండేదని అంటున్నాడు ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారా...
undefined
‘టీమిండియా ప్లేయర్లంటే జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. నేను ఏడేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడబోతుండడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటే నా జట్టు సభ్యులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు...
undefined
ఏడేళ్ల పాటు ఐపీఎల్ ఆడలేకపోయింది నేను అనుకుంటా... నాలాగే హనుమ విహారి కూడా ఆ బాధను అనుభవిస్తున్నాడు. అతను కూడా ఐపీఎల్‌లో ఉంటే ఉంటే చాలా బాగుండేది...
undefined
2019 సీజన్ తర్వాత హనుమ విహారిని తీసుకోవడానికి ఏ జట్టూ తీసుకోలేదు... అతను నాకంటే మంచి స్ట్రైయికర్.. విహారి, ఐపీఎల్‌లో ఉండి ఉంటే టీమిండియా పరిపూర్ణం అయ్యేది’ అంటూ కామెంట్ చేశాడు ఛతేశ్వర్ పూజారా...
undefined
2013లో తొలిసారి ఐపీఎల్ ఆడిన హనుమ విహారి.... 17 మ్యాచులు ఆడి 241 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఓ వికెట్ కూడా తీశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు తెలుగు కుర్రాడు విహారి...
undefined
అయితే ఆ తర్వాతి సీజన్‌లో విహారికి అవకాశం రాలేదు. 2014 వేలంలో హనుమ విహారిని కొనుగోలు చేసింది ఢిల్లీ జట్టు. ఆ తర్వాత మళ్లీ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేసింది...
undefined
2015 సీజన్‌లో 5 మ్యాచులు, 2019లో కేవలం 2 మ్యాచులు మాత్రమే ఆడాడు. రెండు మ్యాచుల్లో కలిపి 4 పరుగులే చేయడంతో అతనికి మరో అవకాశం ఇవ్వని సన్‌రైజర్స్, వేలానికి వదిలేసింది. గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా అతన్ని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు...
undefined
ఐపీఎల్ అమ్ముడుపోకపోవడంపై స్పందించిన హనుమ విహారి... 2021 వేలం అనంతరం ‘Lol’ అంటూ ట్వీట్ చేశాడు. ఛతేశ్వర్ పూజారా బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు కాగా, హనుమ విహారి బేస్ ప్రైజ్ రూ.కోటిన్నర. అందుకే అతన్ని ఏ జట్టూ కొనుగోలు చేయలేదనే వాదన కూడా ఉంది.
undefined
click me!