డబుల్ సెంచరీ చేరువలో రనౌట్... ఫకార్ జమాన్‌ను మోసగించి అవుట్ చేసిన డి కాక్...

Published : Apr 05, 2021, 09:36 AM IST

క్రికెట్... జెంటిల్మెన్ గేమ్. అయితే ఇందులో కూడా కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించేందుకు కొన్ని ట్రిక్స్ వాడాల్సి ఉంటుంది. అలాంటి ట్రిక్‌తోనే డబుల్ సెంచరీ చేరువలో ఉన్న పాక్ బ్యాట్స్‌‌మెన్ ఫకార్ జమాన్‌ను రనౌట్ చేశాడు సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్... అయితే ఈ రనౌట్‌పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. 

PREV
19
డబుల్ సెంచరీ చేరువలో రనౌట్... ఫకార్ జమాన్‌ను మోసగించి అవుట్ చేసిన డి కాక్...

సౌతాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో సఫారీ జట్టు 17 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది. డి కాక్ 80, భవుమా 92, వాన్ డేర్ దుస్సేన్ 60, మిల్లర్ 50 పరుగులు చేశారు. 

29

లక్ష్యచేధనలో 9 వికెట్లు కోల్పోయి 324 పరుగులకే పరిమితమైంది పాకిస్తాన్. ఫకార్ జమాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా బాబర్ ఆజమ్ 31 పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ చేతులెత్తేశారు. 

39

ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా 155 బంతుల్లో 18 ఫోర్లు, 10 సిక్సర్లతో 193 పరుగులు చేసిన ఫకార్ జమాన్... వీరోచిత ఒంటరి పోరాటం చేశాడు.

49

తొమ్మిదో వికెట్‌గా అవుటైన ఫకార్ జమాన్ ఉన్నంతవరకూ పాకిస్తాన్ మ్యాచ్‌పై ఆశలు వదులుకోలేదు. డబుల్ సెంచరీకి 7 పరుగుల దూరంలో ఉన్న ఫకార్ జమాన్, 50వ ఓవర్ మొదటి బంతికి రనౌట్ అయ్యాడు. 

59

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్... ఫకార్ జమాన్ పరుగెడుతున్న సమయంలో నాన్‌స్ట్రైయికర్ వైపు బంతి వేయాల్సిందిగా సిగ్నల్ ఇచ్చాడు. దాంతో తనవైపు బంతి రావడం లేదని భావించిన ఫకార్ జమాన్... నాన్‌స్ట్రైయికర్ వైపు చూస్తూ పరుగెత్తాడు. ఇంతలో బంతి అందుకున్న డి కాక్, ఫకార్ జమాన్‌ను రనౌట్ చేశాడు..

69

ఉద్దేశపూర్వకరంగా బ్యాట్స్‌మెన్ దృష్టి మరల్చి, అతను రనౌట్ కావడానికి కారణం కావడాన్ని కొందరు తెలివితేటలని అంటుంటే, కొందరు మోసం, ఛీటింగ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు...

79

అయితే ఫకార్ జమాన్ మాత్రం ఇందులో డికాక్ తప్పు ఏమీ లేదంటున్నాడు... ‘నా రనౌట్ విషయంలో తప్పు నాదే, నేను నాన్‌స్ట్రైయికర్‌లో హసిర్ రాఫ్‌ను చూస్తూ పరుగెత్తాను. అతను కొద్దిగా లేటుగా రన్‌కి పరుగెత్తాడు,... 

89

కాబట్టి అవుట్ అవుతాడనే ఉద్దేశంతో అటు వైపు చూస్తూ వెళ్లాను. నాకు తెలిసి క్వింటన్ డికాక్ తప్పేమీ లేదు... ఆ తర్వాత మ్యాచ్ రిఫరీని దీన్ని తేల్చాలి’ అంటూ కామెంట్ చేశాడు ఫకార్ జమాన్. 

99

అయితే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం డికాక్‌ను ఛీటర్ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఓ వన్డే మ్యాచ్ గెలిచేందుకు ఇలాంటి ఛీటింగ్ చేయాలా? అంటూ సౌతాఫ్రికా క్రికెట్ జట్టును ట్రోల్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories