Sourav Ganguly: కోల్కతాలో అత్యంత రద్దీ ప్రాంతంలో కొత్త ఇల్లు కొన్న దాదా.. ధర ఎంతో తెలుసా..?

Published : May 21, 2022, 09:56 PM IST

Sourav Ganguly Buys New House: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొత్త ఇంటిని కొన్నాడు. 48 ఏండ్లుగా తాను ఉంటున్న ఇంటిని త్వరలోనే అతడు ఖాళీ చేయబోతున్నాడు. 

PREV
17
Sourav Ganguly: కోల్కతాలో అత్యంత రద్దీ ప్రాంతంలో కొత్త ఇల్లు కొన్న దాదా.. ధర ఎంతో తెలుసా..?

టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ కొత్త ఇంటిని కొన్నాడు. 48 ఏండ్లుగా తాను ఉంటున్న ఇంటిని దాదా ఖాళీ చేయనున్నాడు.  కోల్కతా లోని అత్యంత రద్దీగా ఉండే ఏరియాలో దాదా కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు.

27

కోల్కతాలోని అత్యంత రద్దీగల ప్రాంతంగా పేరొందిన రాడన్ స్ట్రీట్ లో రెండంతుస్తుల భవనాన్ని దాదా  కొనుగోలు చేశాడు. ఈ ఇంటి కోసం దాదా ఏకంగా రూ. 40 కోట్లు వెచ్చించాడు. 

37

సెంట్రల్ కోల్కతా లో నిత్యం  ప్రజలతో కళకళలాడే ఏరియాలో  కోల్కతా ప్రిన్స్ నివసించబోతున్నాడు.  నిత్యం రద్దీగా ఉన్నా వీధి చివర ఇల్లు కావడంతో  దాదా ప్రైవసీ కి కూడా భంగం వాటిల్లకుండా ఉంటుందని అతడి  కుటుంబసభ్యులు చెబుతున్నారు.

47

కోల్కతా  ప్రిన్స్ గా  పేరొందిన  దాదా.. ఈ నగరంలోని బెహాలా ఏరియాలో నివాసం ఉంటున్నాడు. తన పూర్వీకుల నుంచి  దాదా కుటుంబం ఇక్కడే నివాసముంటున్నది.  దాదా పుట్టి పెరిగింది కూడా బెహాలా లోని బిరెన్ రాయ్ రోడ్ లో గల ఇంటిలోనే. 

57

తాను పుట్టినప్పట్నుంచి 48 ఏండ్ల పాటు ఒకే ఇంటిలో ఉన్న దాదా.. ఇప్పుడు ఉన్నట్టుండి ఇంటిని మారడం వెనుక మతలబు ఏముందో తెలియరాలేదు. 

67

అయితే  తాజాగా టెలిగ్రాఫ్ పత్రికతో ఇదే విషయం గురించి గంగూలీ మాట్లాడుతూ.. ‘కొత్త ఇంటిలోకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో నివసించడం కూడా బాగుంటుంది.  అయితే 48 ఏండ్లుగా ఇక్కడే పుట్టి పెరిగిన నా పాత ఇంటిని విడవాలంటే మాత్రం చాలా బాధగా ఉంది...’ అని తెలిపాడు. 

77

గంగూలీ ప్రస్తుతం తన తల్లి నిరుప భార్యా కూతురు డోనా, సన తో కలిసి ఉంటున్నాడు.  ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ గా ఉన్న గంగూలీ.. ఈ ఏడాది అక్టోబర్ తో ఆ పదవీకాలం ముగియనుంది. అయితే గంగూలీకి మరోసారి  బీసీసీఐ అధ్యక్షుడయ్యే అవకాశమున్నా ఇంతవరకు  దానిమీద అతడు స్పందించలేదు. దాదా.. ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

click me!

Recommended Stories