వాళ్లని ఏదైనా అంటే ఫైన్ వేస్తారు, ఎందుకొచ్చిన గొడవ... తన అవుట్‌పై‌ మయాంక్ అగర్వాల్ కామెంట్...

First Published Dec 27, 2021, 8:43 PM IST

క్రికెట్‌లో అంపైర్లు ఇచ్చిన కొన్ని నిర్ణయాల్లో పొరపాట్లు ఉండడం సహజం. మనిషన్న ప్రతీ ఒక్కడూ తప్పు చేస్తాడు. అయితే ఈ మధ్య అంపైర్లు ఇస్తున్న కొన్ని నిర్ణయాలు చాలా వివాదాస్పదమవుతున్నాయి...

గత ఏడాది చివర్లో జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో, ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో, ఆ తర్వాత ఆగస్టులో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా అంపైర్ల తప్పుడు నిర్ణయాలు భారత జట్టును తీవ్రంగా దెబ్బ తీశాయి...

తాజాగా సెంచూరియన్ టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైంది... తాజాగా ఈ నిర్ణయంపై కామెంట్ చేశాడు మయాంక్...

‘నిజం చెప్పాలంటే, నా అవుట్ గురించి మాట్లాడే అధికారం నాకు లేదు. ఒక వేళ నోరు జారి వాళ్లను ఏదైనా అంటే, నా మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. క్రమశిక్షణ తప్పావంటూ వార్తలు రాసేస్తారు... ఎందుకొచ్చిన గొడవ...’ అంటూ కామెంట్ చేశాడు మయాంక్ అగర్వాల్.

123 బంతుల్లో 9 ఫోర్లతో 60 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో ఓ బంతిని ఆడడంలో తడబడ్డాడు. అది మయాంక్ కాళ్లకు తగలడంతో ఇంగిడితో పాటు ఇతర ప్లేయర్లు అప్పీలు చేశారు...

ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, దక్షిణిఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే బ్రాల్ ట్రాకింగ్‌లో బంతి అనూహ్య రితీలో  వికెట్లను తాకుతున్నట్టు చూపించింది...

బంతి కాళ్లను తాకిన పాయింట్‌ను, అప్పటికే బాల్ పయనిస్తున్న దిశను గమనిస్తే... అది వికెట్లను తాకడం అసాధ్యమేనని క్రికెట్ చూసే ప్రేక్షకులు ఎవ్వరైనా చెప్పేయొచ్చు. అలాంటిది గ్రాఫిక్ అనాలసిస్ట్‌కి అది వికెట్లను తాకుతున్నట్టు ఎలా కనిపించిందా అని ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు...

అప్పటికే ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అత్యుత్సాహానికి వెళ్లి రివ్యూ తీసుకుంది సఫారీ జట్టు. అయితే అప్పుడు వారికి అనుకూలంగా ఫలితం రాలేదు... 40 ఓవర్లు దాటిని వికెట్లు పడకపోవడంతో సఫారీ మేనేజ్‌మెంట్‌ ఇలా చేసి ఉంటుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి...

click me!