రోజూ 10 ఛాయ్‌లు, ఓ క్యాన్ రెడ్ బుల్, అర్ధరాత్రి దాకా... ధోనీతో ఉంటే మామూలుగా ఉండదు! - డివాన్ కాన్వే

Published : Jun 16, 2023, 01:22 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ టైటిల్‌తో, ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. 2021 సీజన్‌లో సీఎస్‌కే విజయం అందించిన ఫాఫ్ డుప్లిసిస్, ఆర్‌సీబీ వెళ్లిపోయినా ఆ ప్లేస్‌కి సరైన న్యాయం చేస్తున్నాడు డివాన్ కాన్వే...

PREV
17
రోజూ 10 ఛాయ్‌లు, ఓ క్యాన్ రెడ్ బుల్, అర్ధరాత్రి దాకా... ధోనీతో ఉంటే మామూలుగా ఉండదు! - డివాన్ కాన్వే
Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో 672 పరుగులు చేసిన డివాన్ కాన్వే, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. వర్షం కారణంగా అర్ధరాత్రి దాకా సాగిన ఫైనల్ మ్యాచ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు కాన్వే...
 

27
Image credit: PTI

‘ఫైనల్ మ్యాచ్‌లో వర్షం బ్రేక్ సమయంలో నన్ను నేను నిద్ర నుంచి కాపాడుకోవడానికి టీ తాగుతాను. ఆ రోజు దాదాపు 10 ఛాయ్‌లు తాగేశానేమో. బ్యాటింగ్‌కి సిద్ధంగా ఉండేందుకు రెడ్ బుల్ తాగాను...

37
Image credit: PTI

మ్యాచ్‌కి అంత గ్యాప్ వచ్చిన తర్వాత మెంటల్‌గా సిద్ధంగా ఉండడం చాలా కష్టం. ఆ రోజుని చాలా ఎంజాయ్ చేశా. అదీకాకుండా వర్షం కారణంగా ఫైనల్ వాయిదా పడడంతో మా ఫ్లైయిట్స్ అన్నీ మిస్ అయ్యాయి..

47
PTI Photo/R Senthil Kumar)(PTI05_14_2023_000268B)

మొయిన్ ఆలీ ఫ్యామిలీ, డ్వేన్ ప్రిటోరియస్, ఎరిక్ సిమన్స్ అందరూ ఫ్లైయిట్స్ మిస్ అయ్యారు. ఆ రోజు టీమ్ రూమ్‌లో ఉదయం 9 గంటల దాకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. ధోనీ మాతో పాటు అక్కడే ఉన్నాడు..

57

చాలామంది ఆ రోజు పడుకోకుండానే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేశారు. ధోనీతో ఎంతో విలువైన సమయాన్ని గడిపాను. ఆయనంటే నాకు అమితమైన గౌరవం. ధోనీ చుట్టూ ఏదో శక్తి, వలయంలా ఉంటుంది. అతను రూమ్‌లోకి వచ్చిన ప్రతీసారి నేను దాన్ని ఫీల్ అయ్యేవాడిని..

67

నేను, మొయిన్, అజింకా రహానే కలిసి చాలా సమయం గడిపేవాళ్లం. మేం క్రికెట్ గురించి, జీవితం గురించి కూడా చాలా మాట్లాడుకునేవాళ్లం. స్నూకర్ ఆడుతూ సమయం తెలిసేది కాదు..

77
PTI Photo/Shailendra Bhojak)(PTI04_17_2023_000277B)

ప్రతీ మ్యాచ్‌ అయ్యాక హోటల్ రూమ్‌కి వెళ్లే సరికి ఏ మూడో, నాలుగో అయ్యేది. సీఎస్‌కేలో ప్లేయర్లందరి మధ్య ఓ ప్రత్యేకమైన రిలేషన్ ఉంది. అది ఐపీఎల్‌కి మాత్రమే పరిమితమైంది కాదు...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ క్రికెటర్ డివాన్ కాన్వే..

Read more Photos on
click me!

Recommended Stories