Chetan Sharma: స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా బీసీసీఐ లో లొసుగులు, గంగూలీ - కోహ్లీ వివాదం, టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్, కొత్త ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తిరిగి సెలక్షన్ బాధ్యతలను తీసుకున్నాడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. దీంతో అతడు బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు.
26
Image credit: Chetan Sharma/Instagram
57 ఏండ్ల చేతన్.. స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా బీసీసీఐ లో లొసుగులు, గంగూలీ - కోహ్లీ వివాదం, టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్, కొత్త ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో చేతన్ రెండ్రోజుల తర్వాత అతడే స్వయంగా బీసీసీఐకి తన రాజీనామాను సమర్పించాడు.
36
నాలుగు నెలల పాటు కనీసం ఎవరికీ కనిపించకుండా.. మీడియాకు చిన్న ఇంటర్వ్యూగానీ సోషల్ మీడియాలో గానీ రెస్పాండ్ కాని చేతన్ తిరిగి బీసీసీఐలో చేరాడు. అయితే ఈసారి జాతీయ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా కాదు. నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్ టీమ్ కు సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ భాగమయ్యాడు.
46
ఇక దులీప్ ట్రోఫీలో భాగంగా చేతన్ శర్మ సారథ్యంలోని నార్త్ జోన్.. తమ జట్టుకు మన్‌దీప్ సింగ్ ను సారథిగా ఎంపిక చేసింది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తో పాటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహల్ వధెరా లు కూడా నార్త్ జోన్ లో ఉన్నారు.
కాగా ఈ టీమ్ లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్నాడు. జయంత్.. 2022 లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాడు. అంతేగాక శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టు మ్యాచ్ లో కూడా భాగమయ్యాడు. ఇక దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ కు అజయ్ రాత్ర హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు.