దుబాయ్‌లో కూరగాయలు అమ్ముతున్న మహేంద్ర సింగ్ ధోనీ... ‘కెప్టెన్ కూల్’ బిజినెస్ మామూలుగా లేదు...

First Published Jan 3, 2021, 11:31 AM IST

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... సేంద్రీయ వ్యవసాయంపై ఫుల్లు ఫోకస్ తిప్పేశాడు. రాంఛీలోని తన ఫామ్‌హౌస్‌లో టమాటలు, పాలు, కూరగాయలు పండిస్తున్న ధోనీ, వాటిని దుబాయ్‌లో అమ్మబోతున్నాడట. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న క్రికెటర్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోనీ పండిస్తున్న కూరగాయలకు భారీగా డిమాండ్ ఏర్పడిందట.

రాంఛీలోని మహేంద్ర సింగ్ ధోనీకి 43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రకరకాల కూరగాయలు పండిస్తున్న ధోనీ, పాల డైరీతో పాటు కోళ్ల ఫారం కూడా ఏర్పాటు చేశాడు.
undefined
నల్లకోడి ‘కఢక్‌నాథ్‌’ కోళ్లపై మనసు పడిన ధోనీ, ఐపీఎల్ తర్వాత 2 వేల కోడి పిల్లలను మధ్యప్రదేశ్ నుంచి తెప్పించి, తన ఫాం హౌస్‌లో పెంచుతున్నాడు...
undefined
తన ఫాం హౌస్‌లోని 10 ఎకరాల్లో టమాట, క్యాబేజీ, బొప్పాయి, ఇతర కూరగాయలను పండిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ... ఇన్నాళ్లు వాటిని రాంఛీలోని మార్కెట్లలో విక్రయించాడు...
undefined
ప్రత్యేకమైన బూత్‌లను ఏర్పాటు చేసి, తన డైరీ పాలను విక్రయించిన మహేంద్ర సింగ్ ధోనీ... ప్రతీ బూత్‌లోనూ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్ హౌస్ నుంచి వచ్చిన పాలను బ్యానర్లు ఏర్పాటుచేయించాడు..
undefined
ఇప్పుడు తాను పండించిన పంటను దుబాయ్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ..
undefined
ఐపీఎల్ ముగిసిన తర్వాత మళ్లీ భార్యా పిల్లలతో కలిసి దుబాయ్‌కి వెళ్లాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఇది కేవలం ఫ్యామిలీ హాలీడే ట్రిప్ అని భావించారంతా...
undefined
అయితే తన బిజినెస్ విస్తరింపచేసేందుకే ఈ ట్రిప్ ప్లాన్ చేశాడట ధోనీ... గల్ఫ్‌లో తాను పండించిన ఉత్పత్తులను విక్రయించేందుకు ఏ ఏజెన్సీతో సంప్రదింపులు, చర్చలు, ఒప్పందాలు కూడా జరిగిపోయాయట.
undefined
పూర్తి సేంద్రీయ పద్ధతిలో పండించిన ఈ పంటలకు ఇప్పటికే జార్ఖండ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందులోనూ ధోనీ ఫామ్ హౌజ్ నుంచి వస్తుండడంతో మరింత క్రేజ్ వచ్చింది...
undefined
అందుకే త్వరలోనే ధోనీ పండించిన టమాట, గల్ఫ్ దేశ మార్కెట్లలో ప్రత్యేకం కాబోతోంది... దుబాయ్‌కి ఎగుమతి చేసే బాధ్యత ఫామ్ ఫ్రెష్ ఏజెన్సీ తీసుకుంది...
undefined
ఐపీఎల్ 2020 తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీకి కూడా దూరంగా ఉంటున్న ధోనీ... వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనే మళ్లీ బరిలో దిగబోతున్నాడు...
undefined
2011లో నాటింగ్ఘమ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రనౌట్ అయిన ఇయాన్ బెల్‌ను తిరిగి పిలిచి, క్రీడా స్ఫూర్తిని చాటుకున్నభారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ... 2020 దశాబ్దానికి గాను ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ది డికేట్’ అవార్డు గెలిచాడు.
undefined
నూతన దంపతులు యజేంద్ర చాహాల్, ధనశ్రీ వర్మలకు కూడా దుబాయ్‌లోనే పార్టీ ఇచ్చారు ధోనీ, ఆయన సతీమణి సాక్షి సింగ్ ధోనీ.
undefined
click me!