కడక్‌నాథ్ కోళ్ల ఫారం పెడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ... రెండు వేల కోళ్లకి ఆర్డర్...

Published : Nov 13, 2020, 05:40 PM IST

గత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... ఇప్పుడు తన ఫేవరెట్ వ్యవసాయంపైనే పూర్తి ఫోకస్ మళ్లించాడట. బ్రాండ్ అంబాసిడర్‌గా కొన్ని వేల కోట్లు ఆర్జించిన భారత కూల్ కెప్టెన్ ధోనీ మనసు ఇప్పుడు నల్లగా నిగనిగలాడే కడక్‌నాథ్ కోళ్లపైకి మళ్లిందట. రాంఛీలోని తన ఫామ్‌ హౌస్‌లో ఈ కోళ్లను పెంచబోతున్నాడట ధోనీ.

PREV
110
కడక్‌నాథ్ కోళ్ల ఫారం పెడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ... రెండు వేల కోళ్లకి ఆర్డర్...

మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లా బిలాంచల్ ఏరియాకి చెందిన కడక్‌నాథ్ కోళ్లకి ఈ మధ్య డిమాండ్ భారీగా పెరిగింది...

210

2019 క్రికెట్ వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా గడిపిన మహేంద్ర సింగ్ ధోనీ, రాంఛీలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ కనిపించాడు...

310

ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన మహేంద్ర సింగ్ ధోనీకి రాంఛీలో 43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది... 

410

ఇందులో డైరీ ఫార్మింగ్‌తో పాటు బాతులు, కోళ్లు కూడా పెంచుతున్నాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...

510

ఇప్పుడు కడక్‌నాథ్ కోళ్లను అమితంగా ఇష్టపడిన మహేంద్రుడు, తన ఫామ్‌ హౌస్‌లో ఈ నల్లకోళ్లను పెంచబోతున్నాడట.

610

ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారి నుంచి 2000 కడక్‌నాథ్ కోడి పిల్లలను కొనుగోలు చేశాడట మహేంద్ర సింగ్ ధోనీ...

710

డిసెంబర్ 15, 2020 నాటికి మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్ హౌస్‌లో ఈ కోళ్లను డెలివరీ చేయబోతున్నాడు కోళ్ల వ్యాపారి వినోద్ మేధ...

810

‘మూడు నెలల క్రితం 2 వేల కోడి పిల్లను ఆర్డర్ చేశారు ధోనీ మేనేజర్. వీటికి సంబంధించిన డబ్బులను కూడా చెల్లించేశారు.. ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన క్రికెటర్‌కి కోళ్లను సరాఫరా చేయడం గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు వ్యాపారి వినోద్...

910

కడక్‌నాథ్ కోళ్ల బాగోగులు చూసుకునేందుకు రాంఛీలోని వెటర్నిటీ కాలేజ్‌తో కూడా సంప్రదింపులు చేశాడట మహేంద్ర సింగ్ ధోనీ...

1010

తాను పెంచబోయే కడక్‌నాథ్ కోడి పిల్లలకు పెట్టాల్సిన ఆహారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను దగ్గరుండి చూసుకుంటారు ఈ వెటర్నిటీ కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు.

click me!

Recommended Stories