LSG vs PBKS: పంజా విసిరిన పంజాబ్.. చిత్తుగా ఓడిన లక్నో
LSG vs PBKS IPL 2025: ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తుగా ఓడించింది. వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
LSG vs PBKS IPL 2025: ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తుగా ఓడించింది. వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
LSG vs PBKS IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో పంజాబ్ కింగ్ అద్భుతమైన ఆటతో మరో విజయాన్ని అందుకుంది. శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీతో పాటు సూపర్ బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్ వరుసగా విజయాలతో ముందుకు సాగుతోంది. సిక్సర్ తో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు పంజాబ్ కు విన్నింగ్ రన్స్ కొట్టాడు అయ్యర్.
ఐపీఎల్ 2025 13వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో టీమ్ ఓటమిపాలైంది. దీంతో రిషబ్ పంత్ టీమ్ ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు ఓటములు చూసింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో టీమ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. సొంత మైదానంలో లక్నో ఇన్నింగ్స్ గొప్పగా సాగలేదు. అయితే, నికోలస్ పూరన్ 44 పరుగులు, ఆయుష్ బదోని 41 పరుగులు, చివరలో అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 27 పరుగులు చేయడంలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
172 పరుగుల టార్గెట్ లో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన బ్యాటింతో అదరగొడుతూ కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులతో విజయాన్ని అందుకుంది. పంజాబ్ టీమ్ కు ఇది వరుసగా రెండో విజయం.
పంజాబ్ టీమ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య సింగిల్ డిజిట్ (8 పరుగులు) కే అవుట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ ప్రభు సిమ్రన్ సింగ్ అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు. సూపర్ బ్యాటింగ్ తో కేవలం 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 52 పరుగులు, నేహల్ వధేరా 43 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో విజయాన్ని అందించారు.
ఈ విజయంతో పంజాబ్ టీమ్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో 2వ స్థానంలోకి చేరింది. లక్నో టీమ్ 2 పాయింట్లతో 6వ స్థానంలోకి పడిపోయింది. 4 పాయింట్లతో నెట్ రన్ రేట్ ఆధారంగా విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ లో ఉంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో టీమ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. సొంత మైదానంలో లక్నో ఇన్నింగ్స్ గొప్పగా సాగలేదు.
అయితే, నికోలస్ పూరన్ 44 పరుగులు, ఆయుష్ బదోని 41 పరుగులు, చివరలో అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 27 పరుగులు చేయడంలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
172 పరుగుల టార్గెట్ లో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన బ్యాటింతో అదరగొడుతూ కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులతో విజయాన్ని అందుకుంది. పంజాబ్ టీమ్ కు ఇది వరుసగా రెండో విజయం. పంజాబ్ టీమ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య సింగిల్ డిజిట్ (8 పరుగులు) కే అవుట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ ప్రభు సిమ్రన్ సింగ్ అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు. సూపర్ బ్యాటింగ్ తో కేవలం 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 52 పరుగులు, నేహల్ వధేరా 43 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో విజయాన్ని అందించారు.
ఈ విజయంతో పంజాబ్ టీమ్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో 2వ స్థానంలోకి చేరింది. లక్నో టీమ్ 2 పాయింట్లతో 6వ స్థానంలోకి పడిపోయింది. 4 పాయింట్లతో నెట్ రన్ రేట్ ఆధారంగా విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 పాయింట్లతో టాప్ లో ఉంది.