Rishabh Pant: 27 కోట్ల ప్లేయర్.. మళ్లీ సింగిల్ డిజిట్ కే అవుట్ !
Rishabh Pant IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. దీంతో అతని టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కూడా పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
Rishabh Pant IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. దీంతో అతని టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కూడా పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
Rishabh Pant IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025 13వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో మరోసారి విఫలమయ్యాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తన కొత్త ఫ్రాంచైజీ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.
దీంతో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా ఉన్న రిషబ్ పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గ్లెన్ మాక్స్‌వెల్ వేసిన బంతిని ఆడి యుజ్వేంద్ర చాహల్ క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.
3 మ్యాచ్‌ల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన రిషబ్ పంత్ !
రిషబ్ పంత్ ఔట్ అయిన వెంటనే సోషల్ మీడియాలో లక్నో సూపర్ జెయింట్స్ అభిమానుల ఆగ్రహం పెల్లుబికింది. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. రెండవ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు 3వ మ్యాచ్ లో పంజాబ్‌పై సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. దీనికి తోడూ పంత్ కెప్టెన్సీ వ్యూహాలు జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి.
ఐపీఎల్ అత్యంత ఖరీదైన 27 కోట్ల రూపాయల ప్లేయర్ రిషబ్ పంత్ 3 మ్యాచ్‌ల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పరుగులు ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన ఈ సూపర్ స్టార్ స్థాయికి సరిపోలడం లేదు.
రిషబ్ పంత్ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. మంచి ఇన్నింగ్స్ లను ఆడినప్పటికీ డీసీ ఫ్రాంచైజీ అతన్ని నిలుపుకోలేదు. నవంబర్ 2024లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అతను రికార్డు స్థాయి బిడ్‌ను పొందాడు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అతన్ని రూ.27 కోట్లకు కొనుగోలు చేసి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.
అయితే, పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా విఫలమైన తర్వాత పంత్ సోషల్ మీడియాలో ట్రోలర్లకు టార్గెట్ గా మారాడు. లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు వృధా అయ్యాయంటూ రిషబ్ పంత్ ను టార్గెట్ చేస్తున్నారు.
అయితే, గతంలో ఐపీఎల్ లో భారీ ధర పలికి పెద్దగా రాణించలేకపోయిన వారిని ప్రస్తావిస్తూ పంత్ కు మద్దతు ఇచ్చే వారు కూడా ఉన్నారు. అలాగే, ఐపీఎల్ 2025లో పంత్ ఆడినవి కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమేననీ, ఇంకా ఈ మెగా టోర్నీలో చాలా మ్యాచ్ లు ఉన్నాయని పంత్ కు మద్దతు ఇస్తున్నారు.
ఏదేమైనప్పటికీ పంత్ నుంచి భారీ ఇన్నింగ్స్ లను ఆశించిన అభిమానులు మాత్రం అతని నుంచి ఇలాంటిది ఊహించడం లేదు. రాబోయే మ్యాచ్ లలోనైనా పంత్ అదరిపోయే ఇన్నింగ్స్ లతో పాటు లక్నో టీమ్ కు విజయాలు అందించి కెప్టెన్, ప్లేయర్ గా నిరూపించుకోవాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరీ ఏం చేస్తాడో చూడాలి !