Lucknow Super Giants' Nicholas Pooran plays a shot
LSG vs GT IPL 2025: రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో మరో విక్టరీ అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో రాణించి శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ కు 6 వికెట్ల తేడాతో ఓడించింది.
సీజన్ ప్రారంభంలో రెండు పరాజయాలను ఎదుర్కొన్న తర్వాత పంత్ టీమ్ లక్నో తిరిగి విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో లక్నో టీమ్ లోని నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ లు ఇద్దరు తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడి తన టీమ్ కు విజయాన్ని అందించారు. సాయి సుదర్శన్ ఆడిన మరో హాఫ్ సెంచరీ వృధా అయింది.
ఐపీఎల్ 2025లో 26వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీందో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. అయితే, ఓపెనర్ల వికెట్లు పడిన తర్వాత ఆ జట్టు ఆ జోరును కొనసాగించలేకపోయింది. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.
Sai Sudarshan
గిల్, సాయి సుదర్శన్ సూపర్ నాక్
గుజరాత్ టీమ్ కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 38 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 60 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. సుదర్శన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 56 పరుగులు చేశాడు.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు. దిగ్వేష్ రతి, అవేష్ ఖాన్ లకు తలా ఒక వికెట్ లభించింది.
Image Credit: TwitterLSG
ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పురాన్ విధ్వంసం
181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో టీమ్ కు మంచి ఆరంభం లభించింది. రిషబ్ పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు కానీ 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, మరో ఎండ్‌లో ఐడెన్ మార్క్రామ్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. అతను కేవలం 31 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ కూడా మరోసారి పరుగులు సునామీ రేపాడు. 34 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో 61 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. యంగ్ ప్లేయర్ ఆయూష్ బదోనీ చివరి వరకు క్రీజులో ఉండి 28 పరుగుల ఇన్నింగ్స్ తో 19.3 ఓవర్లలో 186 పరుగులతో లక్నోకు విజయాన్ని అందించాడు.