ఐపీఎల్‌తో డబ్బు వస్తోంది, సీనియర్లను అడగడానికి ఇగో... యువ ప్లేయర్లపై కపిల్ దేవ్ సీరియస్..

Published : Jul 30, 2023, 05:21 PM IST

1983 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్, వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్న టీమిండియా యంగ్ ప్లేయర్లపై సీరియస్ కామెంట్లు చేశాడు. ఐపీఎల్ ద్వారా వస్తున్న డబ్బు కారణంగా కుర్ర క్రికెటర్లకు ఇగో పెరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కపిల్ దేవ్..

PREV
15
ఐపీఎల్‌తో డబ్బు వస్తోంది, సీనియర్లను అడగడానికి ఇగో...  యువ ప్లేయర్లపై కపిల్ దేవ్ సీరియస్..
Rohit Sharma-Kapil Dev

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ప్లేయర్లు, కెరీర్‌లో చాలా సార్లు తమ దగ్గరికి వచ్చి సలహాలు అడిగేవారని... నేటి తరం క్రికెటర్లు ఒక్కరూ కూడా తన వద్దకు రాలేదని ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత కామెంట్లు చేశాడు సునీల్ గవాస్కర్...

25
Ishan Kishan

‘ఇండియాలో ఆడినట్టు వెస్టిండీస్‌లో ఆడితే చెల్లదు. ఇప్పటి యువ క్రికెటర్లలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఐపీఎల్ కారణంగా వీరి కాన్ఫిడెంట్ చాలా పెరిగింది. అయితే వీరిలో నెగిటివ్ పాయింట్ ఏంటంటే... వాళ్లకు అన్నీ తెలుసని అనుకుంటారు..
 

35
Dravid Suryakumar

ఎవ్వరినీ అడగాల్సిన పని లేదని అనుకుంటారు. అయితే మా తరం నమ్మేది ఏంటంటే సీనియర్ ప్లేయర్ల అనుభవం, కుర్రాళ్ల ఆటను మరింత మెరుగుపరుస్తుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో సీనియర్లకు బాగా తెలుస్తుంది...

45

ఐపీఎల్ ద్వారా బాగా డబ్బు వస్తోంది. డబ్బుతో పాటు పొగరు, ఇగో కూడా వచ్చేస్తాయి. ఇప్పటి తరం క్రికెటర్లకు కావాల్సినవన్నీ చిటికెలో అందుతాయి. అందుకే మాకు అన్నీ తెలుసని అనుకుంటారు. సీనియర్లను అడిగేందుకు వాళ్లకు ఇగో అడ్డు వస్తుంది.. 

55

50 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న సునీల్ గవాస్కర్, ప్రస్తుతం వెస్టిండీస్‌లోనే ఉన్నాడు. కుర్రాళ్లు ఎవ్వరైనా ఆయన దగ్గరికి వెళ్లి, విలువైన విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించారా? ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారా? అప్పటి తరానికి, నేటి తరానికి తేడా ఇదే...’ అంటూ కామెంట్ చేశాడు 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. 

click me!

Recommended Stories