సెమీస్ చేరాలంటే ఒక్కటే దారి! ఇంగ్లాండ్ టీమ్‌ని బయటికి రాకుండా బంధించండి.. - పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్

First Published | Nov 10, 2023, 3:36 PM IST

పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్ 2023 ఆడుతుందా? లేదా? అనే విషయంలో హైడ్రామా నడిచింది. భారత జట్టు, ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కి రాకపోతే, పాక్, వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకి రాదని పీసీబీ ఛైర్మెన్లు కామెంట్లు చేశారు.
 

Pakistan

ఏడాది కాలంలో పీసీబీ ఛైర్మెన్‌ల పదవీలో ముగ్గురు మారారు. వచ్చిన ప్రతీ ఒక్కరూ, ఆసియా కప్ కోసం భారత జట్టు, పాక్‌కి వస్తేనే.. తాము వరల్డ్ కప్ ఆడతామని అనడంతో అసలు పాకిస్తాన్, వరల్డ్ కప్ ఆడుతుందా?  అనే అనుమానాలు రేగాయి..

అయితే బీసీసీఐ పంతానికి, పీసీబీ తలవంచక తప్పలేదు. భారీ అంచనాలతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్, మొదటి రెండు మ్యాచుల్లో శ్రీలంక, నెదర్లాండ్స్‌పై ఘన విజయాలు అందుకుంది..
 

Latest Videos


Pakistan Cricket Team

ఫామ్‌లో లేని లంక, పసికూన నెదర్లాండ్స్‌పై గెలిచిన పాకిస్తాన్, ఆ తర్వాత తడబడడం మొదలైంది. టీమిండియాతో మ్యాచ్‌లో 200 మార్కు కూడా దాటలేకపోయిన ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది..
 

బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత వర్షం కారణంగా న్యూజిలాండ్‌పై గెలిచి, ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ పూర్తి ఓవర్ల పాటు సాగి ఉంటే రిజల్ట్ మారిపోయి ఉండేది. అయితే న్యూజిలాండ్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేయడంతో పాకిస్తాన్, సెమీస్ ఛాన్సులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి..
 

ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 273+ పరుగుల తేడాతో గెలిస్తేనే, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ని వెనక్కినెట్టి సెమీస్ చేరగలుగుతుంది. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, పాక్ టీమ్‌కి ఓ ఫన్నీ సలహా ఇచ్చాడు..
 

Pakistan v Bangladesh

‘పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయాలి, తర్వాత ఇంగ్లాండ్ టీమ్‌ని డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టి తాళం వేసేయాలి. ఒక్కో ప్లేయర్‌కి 2 నిమిషాల చొప్పున 20 నిమిషాలు దాటితే, పాకిస్తాన్ గెలిచేస్తుంది...’ అంటూ చెప్పి నవ్వేశాడు వసీం అక్రమ్..
 

click me!