పవర్ ప్లేలో రోహిత్ శర్మ, మిడిల్ ఓవర్లలో విరాట్ కోహ్లీ... వన్డే వరల్డ్ కప్‌లో మనోళ్లదే డామినేషన్..

First Published | Nov 9, 2023, 7:00 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన టీమిండియా, రికార్డుల లెక్కల్లోనూ దూసుకుపోతోంది..

Rohit Sharma

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ టాప్‌లో నిలిచాడు. రోహిత్ ఇప్పటిదాకా పవర్ ప్లేలో 130 స్ట్రైయిక్ రేటుతో 265 పరుగులు చేశాడు..
 

Virat Kohli-Ravindra Jadeja

మిడిల్ ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ కోహ్లీ 397 పరుగులు చేయగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర ఈ రికార్డును అధిగమించేశాడు..


క్రీజులో అత్యధిక సమయం గడిపిన బ్యాటర్‌గా మాత్రం విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. ఇప్పటిదాకా 14 గంటల 39 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, మిగిలిన అందరి కంటే ఎక్కువ సమయం క్రీజులో ఉన్నాడు.
 

Bumrah-Shami-Siraj

జస్ప్రిత్ బుమ్రా ఇప్పటిదాకా 383 బంతులు బౌలింగ్ చేయగా అందులో 268 బంతులు డాట్ బాల్స్‌గా వచ్చాయి.  ఓవరాల్‌గా భారత బౌలర్లు 8 మ్యాచుల్లో 19 మెయిడిన్లు వేశారు..

Mohammed Shami

6 మ్యాచుల్లో ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన భారత జట్టు, ఇప్పటిదాకా 75 వికెట్లు పడగొట్టి టాప్‌లో నిలిచింది. బెస్ట్ బౌలింగ్ యావరేజ్, బెస్ట్ ఎకానమీ, బెస్ట్ బౌలింగ్ గణాంకాలు అన్నీ కూడా భారత బౌలర్ల పేరిటే ఉన్నాయి..

48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన వరల్డ్ కప్‌గా నిలిచింది 2023 టోర్నీ. అయితే ఈ టోర్నీలో అతి తక్కువ సిక్సర్లు (27), అతి తక్కువ ఫోర్లు (130) ఇచ్చిన జట్టు కూడా టీమిండియానే..
 

Latest Videos

click me!